వైరల్ : ఒలంపిక్స్ లో మాధురీ దీక్షిత్ పాటకు ఇజ్రాయెలీ స్విమ్మర్స్ ఆట

Vimalatha
అంతర్జాతీయ క్రీడలు ఒలింపిక్స్ ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒలంపిక్స్ ఫీవర్ పట్టుకుంది. ఈ ఇంటర్నేషనల్స్ స్పోర్ట్స్ లో ఇండియా అథ్లెట్స్ అదరగొడుతున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020కి సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ స్విమ్మర్స్ వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ చేసిన పని బాలీవుడ్ పాటల క్రేజ్ దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉందని నిరూపిస్తోంది. ఇజ్రాయెల్ జట్టు నుండి స్విమ్మర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్స్కీ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో పోటీ పడ్డారు. ఈ సమయంలో ఇద్దరూ మాధురి దీక్షిత్ పాట 'ఆజా నాచ్లే' పాటకు డ్యాన్స్ చేస్తూ ఈత కొట్టారు. వారిద్దరికీ సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజలు ఇజ్రాయెల్ ఈతగాళ్ల పాటల ఎంపికను, స్విమ్మింగ్ లో వారి స్టైల్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ పోటీలలో మొత్తం 20 మంది పాల్గొనగా వీరు 16వ స్థానంలో నిలిచారు. అన్నే దానం అనే ట్విట్టర్‌ యూజర్ ఈ వీడియోను షేర్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
"ఆజా నాచ్లే" చిత్రంలో మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా, రఘుబీర్ యాదవ్, దివ్య దత్తా, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, యశ్‌పాల్ శర్మ, అఖిలేంద్ర మిశ్రా, జుగల్ హన్సరాజ్, సుస్మిత ముఖర్జీ, నోవాజ్, ఉత్తర బాకర్, వినోద్ నాగపాల్, ఆశా సచ్ దేవ్, డి , ఫెలిక్స్ డి అల్వియెల్లా, దర్శన్ జరీవాలా ముఖ్యపాత్రల్లో నటించారు. అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. ఈ హిట్ మూవీకి సలీం-సులైమాన్ సంగీతం అందించారు. 30 నవంబర్ 2007లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: