రూ.200 రెమ్యునేషన్ నుంచి.. నిర్మాతగా ఎదిగిన హీరోయిన్ ?

Divya
ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఛార్మి. ఈమె పంజాబీ ప్రాంతానికి చెందినది. ఈమె తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి వాళ్ళ బ్రదర్ కారణమట.ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
ముంబైలో ఒకసారి సినిమా షూటింగ్ ఆడిషన్స్ జరుగుతుండగా,  అక్కడికి తను కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళినది ఛార్మీ. అక్కడికి దాదాపుగా 5000 మంది అమ్మాయిలు వచ్చారు. వాళ్లను ఒక్కసారిగా ఛార్మీ చూసే సరికి, షాక్ కు గురైంది. ఇక అదే టైమ్ లోనే అక్కడ క్యారవ్యాన్ లో నుంచి కరీనా కపూర్ దిగుతోంది. అలా ఆమెని చూడగానే నేను ఈమె సినిమాలో నటించడానికి వచ్చానా..? అని షాక్ అయిందట.
అక్కడ అందరూ క్యూలో నిల్చున్నారు
అందులో నుంచి 10 మందిని తీయగా,అందులో ఛార్మీ కూడా ఉంది. ఇక ఇది నిజమా ..? కాదా ..? అనుకుంటూ సందేహంలో ఉండగానే,  ఛార్మీని జూనియర్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయిందని చెప్పగానే , ఆమె ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. ఇక ఆ సినిమాలోని హీరో ని చూడగానే ఆమె ఆనందానికి అవధులు లేవు.. ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు.
ఇక ఆమెకు  ఇష్టమైన హీరో హృతిక్ రోషన్ కావడంతో ఆమె ఎంతో సంబరపడిపోయింది ఆ సినిమాలో నటించడానికి. ఇంత మంది స్టార్స్  గా నటిస్తున్న సినిమా లో నటించడం నా అదృష్టం అని అనుకొని హ్యాపీ గా , ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ యాక్టర్ గా నటించింది. ఈమె ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఈమె వయసు 13 సంవత్సరాలు.ఇక ఆమెకు ఆ వయసులో ఆర్టిస్ట్ అంటే ఏమీ తెలియదు. కేవలం అందులో నటించినందుకు ఆమెకు 200 రూపాయలను ఇచ్చారట.

ఇదే తన మొదటి సంపాదన అనుకొని సరిపెట్టుకుంది ఈ భామ. అయితే ఛార్మీ "నీ తోడు కావాలి"అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈమె తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె ప్రస్తుతం నిర్మాతగా కూడా బాగానే రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: