బుల్లి తెరపై నటిస్తున్న సొంత అత్తా కోడళ్లు వీళ్ళే..
1. షాను సన - సమీరా షరీఫ్:
షాన్ సన సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. అంతేకాదు ఈమె బుల్లితెరపై కూడా నటిస్తోంది. ఇక ఈమె కొడుకు అయిన సయ్యద్ అన్వర్ ను సమీరా షరీఫ్ వివాహం చేసుకుంది. సమీరా కూడా సినీ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటిస్తూనే,కొన్ని ప్రోగ్రామ్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక అలా వీరిద్దరూ సొంత అత్తా కోడళ్ళు బుల్లితెరపై రాణిస్తున్నారు.
2. లక్ష్మీ కనకాల - సుమ కనకాల:
బుల్లితెర క్వీన్ గా కొనసాగుతున్న సుమ కనకాల, రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీ కనకాల కూడా పలు సీరియల్స్ లో నటించి అందరినీ మెప్పించింది. ఇక అప్పట్లో అత్త కోడళ్ళు గా బుల్లితెరపై అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
3. శ్రీలక్ష్మి - ఐశ్వర్య రాజేష్:
శ్రీలక్ష్మి అటు సీరియల్స్ లోనూ , ఇటు సినిమాల్లోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె తమ్ముడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఐశ్వర్య రాజేష్ కు శ్రీలక్ష్మి మేనత్త అవుతుంది. అలా వీరిద్దరు కూడా సొంత అత్తా కోడళ్ళు.
వీరితో పాటు మరింత మంది అత్తా కోడళ్ళు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.