చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!

shami
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తున్న లేటెస్ట్ సినిమ చోర్ బజార్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలెజ్ చేశారు చిత్రయూనిట్. ఆకాష్ పూరీ, గహన సింప్పీ జంటగా నటిస్తున్న ఈ సినిమాను దళం, జార్జి రెడ్డి సినిమాలను డైరెక్ట్ చేసిన జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఆకాష్ పూరీ బర్త్ డే సందర్భంగ చోర్ బజార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగినట్టుగానే ఆకాష్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో మాస్ హీరో ఆకాష్ కనిపించనున్నారని చెప్పొచ్చు.
చిత్రయూనిట్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఐవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో వీ.ఎస్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చోర్ బజార్ వెరైటీ టైటిల్ మాత్రమే కాదు వెరైటీ టైటిల్ డిజైన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో ఆకాష్ మాస్ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా సినిమ మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.  ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమా రిలీజ్ కు రెడీగ ఉంది.
అనీల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఆడియెన్స్ మెప్పించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. రొమాంటిక్ సినిమాలో యువ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఆకాష్, కెతిక శర్మల రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. రొమాంటిక్, చోర్ బజార్ రెండు సినిమాలతో ఆకాష్ పూరీ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాలతో ఆకాష్ పూరీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. అంతకుముందు మెహబూబా సినిమాతో ఓ ప్రయత్నం చేసిన ఆకాష్ పూరీ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక ఇప్పుడు చోర్ బజార్ రొమాంటిక్ తో పాటుగా చోర్ బజార్ సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: