తలరాత మార్చిన ''ఇడియట్‌'' ?

Veldandi Saikiran
టాలీవుడ్ హీరోల్లో రవితేజ టాప్ ప్లేస్ లో ఉంటారు. సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా... చిన్న చిన్న క్యారెక్టర్ లతో పెద్ద హీరోగా ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. మొదట్లో హీరో సైడ్ క్యారెక్టర్ లతో పరిచయమైన రవితేజ ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. ఖడ్గం మరియు చిరంజీవులు లాంటి సినిమాల్లో సైడ్ హీరోగా నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. మాస్ మహారాజ్ రవితేజకు... తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఇడియట్. ఇడియట్ సినిమా ను ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న డైలాగులు, మాస్ మహారాజ్ మాస్ డైలాగులు ఇలా ఎన్నో రకాల సన్నివేశాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి.

ఈ సినిమాతోనే రవితేజకు హైట్ రావడమే కాకుండా... వరుస సినిమాలు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అందులో ముఖ్యంగా మాస్ మహారాజ్ కు మాస్ ఫాలోయింగ్ ఈ సినిమా నుంచి మొదలు కావడం విశేషం. ఇక సినిమా వివరాల్లోకి వెళితే.... 2022 ఈ సంవత్సరంలో వచ్చిన ఈ ఇడియట్ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా ఆయన సరసన హీరోయిన్  రక్షిత నటించింది. సినిమాలో పాత్రల విషయానికి వస్తే.... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు కోట శ్రీనివాసరావు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా పూర్తిగా లవ్ ట్రాక్ లో నడుస్తోంది.

తన ప్రేమ కోసం హీరో రవితేజ ఎలాంటి ఇబ్బందులు పడతాడు అలాగే... తన కెరీర్ను ఎలా మలుచుకున్నాడు అనేది ఈ సినిమా సారాంశం. ఈ సినిమాలో ముఖ్యంగా మాస్ డైలాగులు మరియు పాటలు ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తాయి. ఫుల్ గా కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో నడిచిన ఈ సినిమా అప్పుడు హిట్ కొట్టింది. దీంతో మాస్ మహారాజ్ రవితేజ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇక ఈ సినిమా తరువాత వరుసగా పూరి జగన్నాథ్ సినిమాలు చేశాడు రవితేజ. ఈ సినిమా తరువాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, కిక్ ఇలా చాలా సినిమాలు వరుసగా హిట్ ఇచ్చాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇడియట్ సినిమా రవితేజ కెరీర్ నే మార్చేసింది. ఓవర్ నైట్ లో స్టార్ ఇచ్చింది ఇడియట్ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: