నటి సీత లైఫ్ లో ఫెయిల్ అయ్యిందా.. ? ఫెయిల్ చేసారా.. ?

Mamatha Reddy
అలనాటి నటి సీత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. తన నటనతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సీత. ఆడదే ఆధారం, డబ్బులెవరికి చేదు, సగటు మనిషి, చిన్నారి, దేవత, బజార్ రౌడీ, ముద్దుల మామయ్య, పోలీస్ భార్య, చెవిలో పువ్వు ముత్యమంత ముద్దు వంటి సినిమాలు ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆరేళ్ల పాటు తన నటనతో నటించి అలరించిన ఆమె తమిళ నటుడు పార్తిబన్ 1990లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయారు.

వారికి ఇద్దరు కుమార్తెలు కాగా వారి పేర్లు అభినయ మరియు కీర్తన. ఆ తర్వాత రాధాకృష్ణ అనే అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించారు కానీ ఆమె వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. 2001లో భర్తతో విడిపోయింది సీత. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 2010లో టీవీ నటుడు సతీష్ రెండో వివాహం చేసుకోగా వీరి సంసారం ఆరేళ్లపాటు హాయిగా సాగింది. అయితే ఆ తర్వాత ఆయనతో కూడా విభేదాలు రావడం తో విడిపోయారు. 

మోహన్ బాబు గారి ఇన్స్పిరేషన్ తో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సీత సావిత్రి సరోజాదేవి నటన ను ఎంతగానో ఆరాధిస్తారు. పెళ్ళికొడుకులొస్తున్నారు చిత్రంలో ఆమె గతంలో సావిత్రి చేసిన పాత్రను పోషించారు. ఆ సినిమా క్లాసికల్ చిత్రం గుండమ్మ కథ ఆధారంగా రూపొందింది. సావిత్రి చేసిన పాత్రను ఈమె చేశారు. ముద్దుల మావయ్య చిత్రంలో బాలకృష్ణ చెల్లెలుగా చేసిన  ఆమె నటన ను ఎప్పటికీ మర్చిపోలేరు. తన చిత్రాల్లో బిజీగా ఉండగానే శోభన్ బాబు హీరోగా నటించిన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు సీత. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: