వంటలక్క కొత్త సీరియల్.. వావ్.. న్యూ లుక్ అదిరిపోయింది?

praveen
సాధారణంగా సీరియల్స్ బుల్లితెరపై ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటాయి.  కొన్ని సీరియల్స్ మాత్రం అటు ప్రేక్షకులకు తెగ కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. అయితే ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించి బుల్లితెర చరిత్రలోని టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టించింది స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్. ఇక ఈ సీరియల్ లో పూర్తిగా నల్లగా ఉండే  వంటలక్క పడే కష్టాలు ఇక అటు ప్రేక్షకులు అందరిని కంటతడి పెట్టిస్తు ఉంటుంది. అయితే ఈ రేటింగ్ ని బీట్ చేసే సీరియల్ ఇప్పటివరకు బుల్లితెరపై  రాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఈ ఒక్క సీరియల్ ద్వారానే ఈ సీరియల్లో  ప్రధానపాత్రలో నటించిన వంటలక్క( ప్రేమి విశ్వనాథ్)  ఎంతగానో గుర్తింపు సంపాదించింది.

 ఒకసారి స్టేజ్ పైన ప్రేమ విశ్వనాధ్ కనిపిస్తేచాలు బుల్లితెర ప్రేక్షకులను మురిసిపోతున్నారు. ఇలా కార్తీకదీపం సీరియల్ లో బుల్లితెర హిస్టరీ లో సంచలన రికార్డు నమోదు చేసింది ప్రేమి విశ్వనాథ్. దాదాపు మూడున్నర ఏళ్లుగా కూడా బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే కార్తీక దీపం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన ప్రేమ విశ్వనాధ్ ఇప్పటివరకు వేరే సీరియల్స్ మాత్రం చేయలేదు. అయితే కేవలం తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా ఎలాంటి సీరియల్ చేయలేదు ప్రేమి విశ్వనాథ్. కానీ ఇటీవలే ఒక సరికొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రేమి విశ్వనాథ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  అయితే కార్తీకదీపం లో లాగా నలుపు రంగులో కాకుండా ఎంతో అందంగా స్టైలిష్ లుక్ లో సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ కనిపించబోతున్నట్లు సమాచారం.

 అయితే ఇటీవలే ఇక ప్రేమీ విశ్వనాథ్ సీరియల్ కు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక మలయాళంలో ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్న సీరియల్ కు దేవిక అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూలై 5వ తేదీ నుంచి సూర్య టీవీలో రాత్రి 8:00 కు ఈ సీరియల్ ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ సీరియల్కు సంబంధించి విడుదలైన ప్రోమోలొ మోడ్రన్ డ్రెస్సులో ఎంతో స్టైల్గా కనిపిస్తుంది వంటలక్క. అయితే ప్రస్తుతం వంటలక్కను చూస్తుంటే భాష అర్థంకాకపోయినా ప్రేక్షకులు తమిళ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే అలాగే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: