శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

Divya

శివగామి పాత్ర లో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ అద్భుతంగా నటించి, ఆ పాత్రకు ఆమె తప్ప మరెవరు న్యాయం చేయలేరు అన్నంతగా నటించి, ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమ్ ను  సంపాదించుకున్న బాహుబలి సినిమాలో శివగామి పాత్ర  ప్రత్యేకం. ఈ పాత్రకు మొదట దర్శకుడు రాజమౌళి శ్రీదేవిని అడిగారట. శ్రీదేవి అడిగిన రెమ్యూనరేషన్ చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు దర్శకుడు. అడిగినంత ఇచ్చుకోలేక ఆ పాత్రకి రమ్యకృష్ణను ఎంచుకోగా, ఇక ఆ పాత్రకు పూర్తి ప్రాణం పోసి నటించింది రమ్యకృష్ణ. అయితే  శ్రీదేవి శివగామి పాత్ర కోసం ఎంత రెమ్యూనరేషన్ అడిగింది.. ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
అందాల తార.. అతిలోక సుందరి ..అయిన శ్రీదేవి  ఏ పాత్రకైన  సరిపోతుంది అన్న ఒక్క కారణంతో శివగామి పాత్ర కోసం రాజమౌళి శ్రీదేవిని మొదట సంప్రదించారు. అయితే కథ పూర్తిగా విన్న తర్వాత , ఈ సినిమా మా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందుతుందనే ఉద్దేశంతోనే ఆమె కోట్ల రూపాయలను డిమాండ్ చేశారని సమాచారం.అది ఎంతో కాదు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను ఆమె డిమాండ్ చేశారట. ఇక నిర్మాతలు ఆ పాత్ర కోసం అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో, ఆమె ఆ పాత్రను వదులుకోవాల్సి వచ్చిందట. ఇక రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించి, ఆ పాత్ర చరిత్రలో మిగిలి పోయేలాగా పర్ఫామెన్స్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం..
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రాజమౌళి అలా చెప్పడంతో శ్రీదేవి ఆ మాటలను పూర్తిగా ఖండించారు. అంతేకాదు.." నేను డబ్బు కోసం ఆశపడి ఉంటే, ఇన్ని సంవత్సరాలలో..ఎన్నో  సినిమాలలో..అన్ని మంచి క్యారెక్టర్లు పోషించి ఉండేదాన్ని కాదు. రాజమౌళి గారు ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. మరో విశేషం ఏమిటంటే తమన్నా నటించిన అవంతిక పాత్ర కూడా మొదట అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని అడిగారట.కానీ సోనమ్ రిజెక్ట్ చేయడంతో తమన్నాను ఓకే చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: