హ్యాపీ బర్త్ డే : నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అల్లరి నరేష్ కే సాధ్యం..!

NAGARJUNA NAKKA
తెలుగు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ చాలా స్పెషల్. ఏ పాత్రలోనైనా అలా ఒదిగిపోయో గుణం ఆయకుంది. టాలీవుడ్ హీరోల అందరిలో అల్లరి నరేష్ చాలా ప్రత్యేకతే అని చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో కామెడీ పండించడంలో ఆయనకు ఆయనే సాటి. కరెక్ట్ టైమింగ్ లో డైలాగ్ డెలివరీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తాడు.  తన సినీ జీవితంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు.
తెలుగు ఇండస్ట్రీలో అల్లరోడిగా గుర్తింపు పొందిన ఈ హీరో రియల్ గా చాలా డీసెంట్. ప్రేక్షకులను తన కామెడీతో గిలిగింతలు పెట్టడంలో ఆయనే స్టైలే వేరు. ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేసే ఈ హీరో ఈ మధ్య యాక్షన్ సినిమాలు కూడా చేస్తూ తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందాడు. రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అల్లరి సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయ్యాడు. ఆ సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచి ఆయనకు అల్లరి నరేష్ గా పేరొచ్చింది. అల్లరి నరేష్ తెలుగు ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ కుమారుడు.
ఆ తర్వాత తన తండ్రి, దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తెరకెక్కించిన సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. కామెడీ సినిమాలతోనే కాదు గమ్యం నేను లాంటి సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్స్ లో ఒదిగి మెప్పించారు నరేష్. ఇటీవల రిలీజ్ అయిన నాంది సినిమాతో నరేష్ కు మంచి హింట్ సంపాదించుకున్నాడు. ఒక మర్డర్‌ కేసులో చిక్కుకొని.. ఐదేళ్లు జైల్లో చిత్రహింసలు అనుభవించే పాత్రలో ఒదిగిపోయాడు.  చేయని తప్పునకు శిక్ష అనుభవించే వ్యక్తిగా అల్లరి నరేష్ నటించిన విధానం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
అల్లరి నరేష్ హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరు సంపాదించుకున్నాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది.  
నాంది సినిమాతో అల్లరి నరేష్ లో మరో కోణాన్ని ప్రదర్శించి విజయం సాధించాడు. ఇకపై ఇలాంటి కథాబలమున్న చిత్రాల్లో నటించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలా ఐదు కథలతో ఆయన సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అల్లరి నరేష్ ఇలానే ప్రేక్షకులను అలరించాలని ఇండియా హెరాల్డ్ కోరుకుంటూ.. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: