స్టార్ అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ పతనానికి కారణం అదే ?

NIKHIL VINAY
సినిమా అనేది ఇక రంగులలోకం ఒక రోజు అందాలన్నీ చూపించినా సినిమానే ఇంకో రోజు పాతలన్నీ కూడా చూపిస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఏ యాక్టర్ కి అయిన తప్పదు. అయితే కొంతమంది సినిమాల్లో సూపర్ హిట్స్ చూసిన వాళ్ళు వరసగా ప్లాప్స్ రావడం తట్టుకోలేరు.అలా యంగ్ సెన్సేషన్ ఉదయ్ కిరణ్ ఆయన కెరీర్ మొదట్లో చిత్రం , నువ్వు నేను , మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చూసిన ఆయన ఆ తర్వాత వచ్చిన ప్లాప్స్ ని తట్టుకోలేకపోయారు.
అన్ని బాగుంటే ఉదయ్ కిరణ్ ని ఇప్పుడు టాప్ హీరోగా చూసేవాళ్ళం కానీ అది జరగలేదు. ఇండస్ట్రీలో అవకాశాలు లేక అలాగే ఫైనాన్షియల్ గా చాలా బాధలు పడుతూ ఉదయ్ కిరణ్ 2014 లో  సూసైడ్ చేసుకున్నాడు. సినిమా అవకాశాలు రాక ఆయన ఈ పని చేసారు. ఒకసారి దీనికి కారణాలు ఏంటి అని చూస్తే ముందుగా మనకు వినిపించేది చిరంజీవి కూతురుతో పెళ్లి. దాదాపుగా పెళ్లి పీటల వరకు వచ్చిన ఈ విషయం ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ అయ్యాక క్యాన్సిల్ చేశారు. ఆ కోపం తో ఆయన కెరీర్ ని మెగా ఫామిలీ నాశనం చేసింది అని అంటారు కానీ ఉదయ్ కిరణ్ ఆ విషయం జరిగిన తర్వాత ఉదయ్ కిరణ్ చాలా సినిమాలు చేశారు. కానీ వాటిలో ఏవి విజయం సాధించలేదు.
అయితే 2014 లో జరిగిన ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయన అక్క శ్రీదేవి ఈ చిరు ఉదయ్ కిరణ్ కాంట్రావెర్సీ కి చెక్ పెట్టారు. ఉదయ్ కిరణ్ ని మెగాస్టార్ చాలా సపోర్ట్ చేసేవాడు అని అప్పట్లో ఉదయ్ కిరణ్ బ్రేకప్ లో ఉన్నప్పుడు చిరు ప్రత్యేకంగా కలిసి బాధని పంచుకునేవాడు అని నిజానికి చిరంజీవి కూతురుతో పెళ్లి ఇరు కుటుంబాలు కలిసి అన్ని ముందే అనుకోని ఆపేశారు అని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: