రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ లో మా రాజకీయం !

Seetha Sailaja
దేశ రాజకీయాలకు మించిన స్థాయిలో ‘మా’ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై కొందరి ఆధిపత్య పోరుకు నిదర్శనంగా మా సంస్థ ఎన్నికలపోరు చాల ముందుగానే వేడిని పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మా ఎన్నికల విషయమై వివాదాల వర్మ చేసిన ట్విట్స్ చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

ఈ ట్విట్స్ వర్మ శైలికి భిన్నంగా ఉండటంతో వీటి వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ప్రస్తుతం మా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ విషయంలో వర్మ కామెంట్స్ ఉన్నాయి. "ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా?’ అంటూ వర్మ ప్రకాష్ రాజ్ కు ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చాడు.

అంతేకాదు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే గుడివాడ నుండి చెన్నై వెళ్ళి అక్కడ తెలుగు సినిమా రంగాన్ని ఏలిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ లు కూడ నాన్ లోకల్ కేటగిరి లోకి వస్తారని వర్మ అభిప్రాయ పడుతున్నాడు. దీనితో వర్మ ‘మా’ సంస్థ సభ్యుడు కానప్పటికీ ఇప్పుడు అతడు మా రాజకీయాలలోకి ఎంటర్ అయినట్లే లెక్క అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అని అంటున్నారు. సాధారణంగా వర్మ తన ట్విట్స్ ను తెలుగులో పెట్టాడు.

అయితే తన తీరుకు భిన్నంగా తన స్పష్టమైన తెలుగులో తన ట్విట్స్ పెట్టడమే కాకుండా చాల చక్కటి పదాల పొందికతో చేసిన ఈ ట్విట్స్ వర్మవి కావు వీటి వెనుక ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తులు ఉన్నారు అంటూ ప్రచారం మొదలైంది. అనేక వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రస్తుతం కొనసాగుతున్న మా ఎన్నికలు క్లైమేక్స్ వచ్చే సరికి ఇంకా అనేక ట్విస్ట్ లకు తావు ఇచ్చే ఆస్కారం ఉంది అనిపిస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: