ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మా ఎన్నికల చర్చ నడుస్తుంది. ఇంకా ఎన్నికల తేదీలను ప్రకటించలేదు కానీ అప్పుడే ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? అంటూ అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఏ అభ్యర్థికి ఎవ‌రి సపోర్ట్ ఉంది..? అనే అంచనాలు కూడా భాగానే వినిపిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. మిగతా ముగ్గురి విషయం పక్కన పెడితే ప్రకాష్ రాజ్ మాత్రం ప్రస్తుతం మా ఎన్నిల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రకాష్ రాజ్ నాన్ లోక‌ల్ అని ఆయ‌నది క‌ర్నాట‌క అనే అంశం తెరపైకి రావడంతో చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. ఇక ఆయనకు పలువురు మద్దతు ఇస్తున్నారు.వారిలో నాగ‌బాబు, బండ్ల గ‌ణేష్, శ్రీకాంత్ త‌దిత‌రులు ఉన్నారు. 

ఇక‌  తాజాగా వివాదాల దర్శకుడు ఆర్జీవీ సైతం ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ వ‌రుస పోస్టులు పెట్టాడు. సోషల్ మీడియాలో వ‌ర్మ‌...కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన  రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నుండి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు...మహారాష్ట్ర నుండి వచ్చిన రజినీకాంత్ లోకలా ??? ఎలా ఎలా ఎలా..? అంటూ ప్రశ్నలు కురిపించారు. అంతే కాకుండా ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి  తెలుగు నేర్చుకుని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకల్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. 

అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి నేషనల్ తో సత్కరిస్తే ,మీరు ఆయన్ని నాన్ లోకల్ అంటారా? మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్రూష్ ప్రీ నాన్ లోకల్ ..రాముడు సీత కూడా నాన్ లోకల్ ..ప్రకాష్ రాజ్ కూడా నాన్ లోకల్ అంటూ ఆర్జీవీ రెచ్చిపోయారు. మొత్తానికి ఆర్జీవీ తాను ప్రకాష్ రాజ్ వైపే అని చేపకనే చెప్పేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: