వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

Chaganti
ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయం కూడా వివాదాస్పదం అయిపోతోంది. ముఖ్యంగా టీవీ షోలలో యాంకర్లు లేదా పార్టిసిపెంట్ లు చిన్న మాట మాట్లాడినా దాని వెనుక అర్ధాలు తీసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఎవరో ఒకరు యుద్ధానికి దిగుతున్నారు. ఈ మధ్యకాలంలో అలాగే హైపర్ ఆది ఒక వివాదంలో చిక్కుకున్నాడు.. ఈటీవీ కోసం చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కార్యక్రమంలో బతుకమ్మను, గౌరమ్మను కించ పరిచాడు అంటూ తెలంగాణ జాగృతి అనే సంస్థకు చెందిన సభ్యులు ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. 


ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తే తాను ఆ మాట అనలేదు అని అన్నట్లు మీరు ఫీల్ అయితే క్షమాపణ చెప్పడానికి సిద్ధం అని చెప్పాడు. తాజాగా అలాంటి వివాదంలో యాంకర్ ప్రదీప్ చిక్కుకున్నాడు. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ తెలుగులో లీడింగ్ ఛానల్స్ అన్నిటిలో యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జీతెలుగు కోసం సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 3 అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో అందులో పాల్గొన్న సీరియల్ ఆర్టిస్ట్స్ తో సరదాగా మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ ఏది ? అని ఆయన ప్రశ్నించారు.


దానికి అందులో పాల్గొన్న నటి వైజాగ్ అని వెటకారంగా కూడిన హావభావాలతో చెప్పడం ఇప్పుడు అమరావతి రైతులకు కోపం తెప్పించింది. సుమారు 550 రోజుల నుంచి అమరావతి ఉద్యమం చేస్తూ పనులన్నీ మానేసి అమరావతి కోసం కష్టపడుతుంటే ఇలా నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే తమ మనోభావాలను దెబ్బ తీయడం కరెక్టేనా అని వాళ్ల ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు గనక ప్రదీప్ మాచిరాజు తమకు క్షమాపణ చెప్పకపోతే  అమరావతి ఉద్యమకారులు ప్రదీప్ ఇంటిని ముట్టడి చేస్తానని చెబుతూ అమరావతి పోరాట సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. మరి ప్రదీప్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: