ఈ వారంలో తెలుగు ఓటీటీ రిలీజ్ లు ఏమేంటో తెలుసా?

Chaganti
కరోనా కారణంగా దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఓటీటీకి కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున తెలుగు ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి.. ఇక ఈ వారం రోజుల్లో తెలుగులో ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి ? ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


11వ తేదీన అంటే శుక్రవారం నాడు తెలుగులో దాదాపుగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రంగ్ దే సినిమా జి5 యాప్ ద్వారా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా గతంలోనే థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయింది. ఇక కార్తీక్ రత్నం - కృష్ణ ప్రియ జంటగా నటించిన అర్థ శతాబ్దం సినిమా కూడా 11వ తేదీ నుంచి ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. 


ఇక 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో పచ్చీస్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. రామ్స్, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రాబోయే సినిమాల విషయానికి వస్తే పద్దెనిమిదో తారీఖు జూన్ నెలలో హిందీ నేమ్ ఆఫ్ గాడ్ అనే ఒక క్రైమ్ త్రిల్లర్ సిరీస్ ఆహా వీడియో ద్వారా ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రాబోతోంది. ప్రియదర్శి, నందిని రాయ్, krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి లాంటి కీలక నటులు ఈ సిరీస్ లో నటించడంతో సిరీస్ మీద ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ సిరీస్ తర్వాత తెలుగులో ఈ వారానికి చెప్పుకోదగ్గ సినిమాలు సిరీస్ లు అయితే ఇంకా ఏవీ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: