ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Chaganti
టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చాలా తక్కువగానే వచ్చినా, వచ్చిన దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఫలానా దర్శకుడు అని కాకుండా దాదాపు అందరు దర్శకులు ఇలాంటి ఫ్యామిలీలు సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత హీరో హీరోయిన్లుగా 2010 అక్టోబర్ 14న విడుదలైన ‘బృందావనం’ సినిమా ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. అప్పటికే మున్నా లాంటి ఒక సినిమా చేసి ఉన్నా దర్శకుడు వంశీ పైడిపల్లి ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. 

దాదాపు అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఈ సూపర్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విడుదలైన మొదటి ఆట నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులైతే ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. చేసింది రెండో సినిమానే అయినా దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా అనుభవం ఉన్న దర్శకుడు లాగా సినిమాను తెరకెక్కించారు. అలాగే, సంగీత దర్శకుడు తమన్ సైతం ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నారు. 

తమన్ సంగీతాన్ని అందించిన దాదాపు అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఎవరూ చేయని కథ తో ప్రయోగం చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి హీరో ఎన్టీఆర్ ఎవరు ఊహించని విధంగానే సూపర్ హిట్ సినిమా అందుకున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, ముఖేశ్ రుషి, తనికెళ్ల భరణి, వేణు మాధవ్, బ్రహ్మాజీ, ప్రగతి, హేమ, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, సన, సురేఖ వాణి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరా దాదాపు చాలా మంది ఈ సినిమాలో నటించి సూపర్ హిట్ సినిమాలో భాగమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: