నాని సినిమాకి సాయిపల్లవి నెగటివ్ సెంటిమెంట్..!
ఇక సాయి పల్లవి నటించిన కణం`, `పడి పడి లేచే మనసు`, మారి 2`, ఎన్జీకే వంటి సినిమాలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన బైలింగ్వల్, స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేకపోయాయి. ఈ సినిమాలోని సాంగ్స్, సాయి పల్లవి డాన్స్ యూ ట్యూబ్ లో రికార్డు సృష్టించాయి.
ఇక ముఖ్యంగా చెప్పాలంటే.. సాయిపల్లవి కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందనుకున్న `పడి పడి లేచే మనసు`.. ఊహాతీత ఫలితాన్ని చూసింది. ఇక సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక `విరాట పర్వం` విడుదలకు సిద్ధం కాగా.. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ మూడు సినిమాలో ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తోంది పల్లవి. క ఇదిలా ఉంటే `పడి పడి లేచే మనసు` తరహాలోనే `శ్యామ్ సింగ రాయ్`లోనూ బెంగాలీ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న `శ్యామ్ సింగ రాయ్` అయినా పల్లవి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి మరి.