బుల్లితెర నటీమణులకు కాస్ట్యూమ్స్ ఎవరు ఇస్తారో తెలుసా?

Divya

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచం లో మునిగి తేలాలంటే చాలా కష్టం. అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలతో పాటు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా రంగురంగుల చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే  చాలా మంది యువత కేవలం ఈ బుల్లితెర హీరోయిన్ లనే నిజ జీవితంలో కూడా బాగా ఫాలో అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు తీసుకొచ్చే సరికొత్త ట్రెండ్ ను యువత ఎక్కువగా వాడుతున్నారు. అందుకు ముఖ్య కారణం బుల్లితెరలో వారు ఉపయోగించే కాస్ట్యూమ్స్ అని చెప్పవచ్చు.

ఈ బుల్లి తెర పై నటీమణులు ఉపయోగించే కాస్ట్యూమ్స్ ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అంటే, కొంతమందేమో కేవలం ఈ కాస్ట్యూమ్స్ చూడటం కోసమే సీరియల్స్ చూస్తారు.  ఇక చాలా వరకు నటీమణులు ధరించే దుస్తులు, వేసుకునే ఆభరణాలు అన్నీ కూడా భిన్నంగా కనిపిస్తాయి. అందుకోసమే చాలామంది వీటిని చూడటం కోసం సీరియల్ చూస్తున్నాము అంటూ సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ వీరికి ఎవరు ఇస్తారు?ఎక్కడి నుంచి వస్తాయి?ఇంత ట్రెండ్ ఎలా సెట్ చేస్తారు?అనే ప్రశ్నలు ఎంతోమంది లో  తలెత్తుతున్నాయి. ఒక ముఖ్యంగా చెప్పాలంటే వీటికి సమాధానం తెలుసుకోవాలని కూడా ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం వీరికి కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బుల్లితెరపై ఉపయోగించే కాస్ట్యూమ్స్ ని స్వయంగా వారే తెచ్చుకుంటారు. వీరికి నిర్మాతలు ఎలాంటి కాస్ట్యూమ్ లు ఇవ్వరు. పాత్రకు తగ్గట్టుగా నటీమణులే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవాలి. ఇటీవలే పలువురు ఈ  కాస్ట్యూమ్స్ పై స్పందించిన విషయం కూడా తెలిసిందే . ముఖ్యంగా వీరు హైదరాబాదులోని బేగంబజార్, ఆర్కే కలెక్షన్స్ లాంటి ప్రముఖ ఏరియాలకు వెళ్లి తమకు నచ్చిన కాస్ట్యూమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ, బుల్లితెరపై ధరిస్తూ ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉంటారు. సాధారణంగా వీరు వేసే కాస్ట్యూమ్స్ కి ఎలాంటి మ్యాచింగ్ ఉండదు. కానీ వీరే స్వయంగా డిజైన్ చేయించుకొని మరీ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించవచ్చు. వీరు వేసిన డ్రస్సు వేయరు అని అందరూ అనుకుంటారు. కానీ అలా కాదు వీరు కొంచెం  డ్రెస్ పాట్రన్ చేంజ్ చేసి మరీ వేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: