మన ఇండస్ట్రీ డైరెక్టర్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Divya

మన తెలుగు ఇండస్ట్రీ  పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకు కారణం మన మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అని కూడా చెప్పవచ్చు. మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోవడం లేదు. అంతే కాదు ఎంతో మంది బాలీవుడ్ భామలు కూడా.. ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ బాలీవుడ్ కాదు టాలీవుడ్ టాప్ అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతలా మన తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఫామ్ లోకి తీసుకు వచ్చింది మాత్రం తెలుగు దర్శకులు అని చెప్పడం ఉత్తమమైన పద్ధతి. అయితే ఇంతలా స్టార్ ఇమేజ్ ను సంపాదించి పెట్టిన మన తెలుగు స్టార్ డైరెక్టర్లు సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే మన డైరెక్టర్లు ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

రాజమౌళి:
దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి.. ఈయన  చేయబోయే పాన్ ఇండియన్ మార్కెట్ ను బట్టి ఆయన పారితోషికం సరిగా అంచనా వేయడం కూడా కష్టమే. దాదాపుగా రూ.30 కోట్లకు పైనే లాభాల్లో వాటా ఉంటుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ :
ఈయన దర్శకత్వం వహించిన అల వైకుంఠపురం చిత్రం తర్వాత ఈయన రేంజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.20 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు.
కొరటాల శివ :
దాదాపు రెండు సంవత్సరాల నుండి ఒకే సినిమా పై, అంటే చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమాపై పనిచేస్తుండడంతో  రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

సుకుమార్ :
రామ్ చరణ్  రంగస్థలం తర్వాత  ఈయన క్రేజ్ పెరిగిపోయింది. ఇక సుకుమార్ కూడా రూ.20 కోట్లు తీసుకుంటున్నారు.

బోయపాటి శ్రీను :
ఈయన రూ.10 కోట్లను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నారు.
అనిల్ రావిపూడి :
ఈయన  రూ.8 కోట్లు పారితోషకం పుచ్చుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ :
సొంత నిర్మాణ సంస్థ  వుంది కాబట్టి అంచనా వేయలేము. కానీ బయట చేసినప్పుడు రూ.10 కోట్లు తీసుకుంటారు.
నాగ్ అశ్విన్ :
మహానటి సినిమా ద్వారా క్రేజ్ పెంచుకున్న ఈయన రూ.8 కోట్లు తీసుకుంటున్నారు.
వంశీ పైడిపల్లి -రూ.6 కోట్లు, మారుతి  - రూ.5 కోట్లు, హరీష్ శంకర్ - రూ. 6 కోట్లు, సురేందర్ రెడ్డి - రూ.7 కోట్లు, పరుశురామ్ - రూ.8 కోట్లు, వీ. వీ. వినాయక  - రూ.7 కోట్లు, శేఖర్ కమ్ముల - రూ. 5 కోట్లు, క్రిష్ - రూ.4 కోట్లు, గోపీచంద్ మలినేని  - 2 కోట్లను పారితోషికం కింద తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: