ఆ కోరిక ప్రశాంత్ నీల్ తో తీర్చుకుంటున్న ఎన్టీఆర్!

Chaganti
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆయన ఆర్ఆర్ఆర్ అనే ఒక ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు..పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. అనుకోని కారణాలతో సినిమా రద్దు చేయబడింది. ఆ స్థానంలో ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు.


అయితే త్రివిక్రమ్ తో సినిమా  అనుకున్న క్రమంలో ఆ సినిమాలో ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడని అందుకే ఈ సినిమా టైటిల్ కూడా అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడ్డారు. ఇక ఆ సినిమా రద్దు కావడంతో వాళ్ళంతా నిరాశకు గురయ్యారు. అయితే వారికి ఆనందం కలిగించేలా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా రద్దు కావడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. 


పైకి రాజకీయాల మీద ప్రస్తుతానికి ఆసక్తి లేనట్లు కనిపించినా స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రాజకీయాల మీద ఆసక్తి ఉంటుందని ఆ ఆసక్తి తగ్గట్టే ఇలా బయట పెట్టుకుంటున్నాడు అని కొందరు విశ్లేషిస్తున్నారు. అంతకు ముందు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక టాక్సీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. మరి ఈ పొలిటికల్ లీడర్ పాత్ర కూడా అలాగే ప్రచారానికే పరిమితం అవుతుందా లేక నిజంగానే ఆయన పొలిటికల్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: