అనసూయ బర్త్ డే స్పెషల్..!

Suma Kallamadi
తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన యాంకర్ ఎవరని అడిగితే వెంటనే సుమ కనకాల అని చెబుతారు. ఆ తర్వాత అనసూయ పేరునే చెబుతారు. తన అందంతో, మాటలతో అనసూయ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. టెలివిజన్ స్థాయిలో ఓ పెద్ద యాంకర్ గా ఎదిగింది. జీవితంలో ఎన్నో ఆనందాలే కాదు కష్టాలను కూడా అనుసూయ అనుభవించింది. నేడు అనసూయ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈరోజు ఆమెకు ఇది 36వ పుట్టినరోజు. మే 15, 1985లో అనసూయ నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జన్మించారు. వారి ఇంట్లో అనసూయే పెద్ద అమ్మాయి. అనసూయకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తాను పుట్టిన తర్వాత వారి అమ్మ పవిత్ర అని పెట్టాలనుకుంది. అయితే వారి నాన్నగారు అమ్మమ్మ పేరు అయిన అనసూయనే ఖరారు చేశారు. అనసూయ 2008లో భద్రుక కళాశాల నుండి ఎంబిఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె ఒక ప్రముఖ టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా వహించింది.
అనసూయకు సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది. వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్. టెలివిజన్ లో వార్తా వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత ఆమె జబర్దస్త్ షో లో యాంకర్ గా మారింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించింది. ప్రస్తుతం ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’  సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. మలయాళంలో మమ్ముట్టి సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. రెండు వెబ్‌సిరీస్‌లూ చేస్తూ బిజీగా ఉంటోంది. టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసార్లు జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: