అందుకే చిరుతో హీరోయిన్ గా చేయలేకపోయాను..?

Divya

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి సరసన, ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి సరసన ఒక్క సినిమా చేసినా చాలు, వాళ్ళ కెరియర్ అమాంతం మారిపోతుంది కాబట్టి. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇటీవల ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవితో కలసి నటించడానికి అవకాశాలు వచ్చినా,  కొన్ని కారణాల చేత హీరోయిన్ గా  చేయలేకపోయాను అంటూ వివరణ ఇచ్చింది.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేయలేకపోయింది..?  అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ క్లుప్తంగా చదివి తెలుసుకుందాం..


ఆ హీరోయిన్ ఎవరో కాదు గౌతమి. నిజానికి గౌతమి తెలుగమ్మాయి. కానీ ఈమె టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి ,స్టార్ హీరోయిన్ గా ఎదిగింది .అయితే తెలుగులో" దయామయుడు ,గాంధీ నగర్ రెండో వీధి" వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వెంకటేష్ సరసన శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో కూడా నటించి, అందరినీ మెప్పించింది. ఇదిలా ఉండగా ఒకపక్క ఆమెకు వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె ఆఫర్లను మిస్ చేసుకుంది..


ఇక మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా మూడు సినిమాలలో,  హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినా, మిస్  చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా గౌతమి నే" ఆలీతో సరదాగా"   ప్రోగ్రాం లో ఆలీతో సరదాగా పంచుకుంది. ఈ విషయంపై గౌతమి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది .కానీ మిస్ చేసుకున్నాను. అందులో ఒకటి స్టేట్ రౌడీ కూడా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ "నారి నారి నడుమ మురారి "అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ ఆ రెండు ఛాన్సులు వదులుకోవాల్సి వచ్చింది..


ఇందుకు కారణం అదే టైంలో కమల్ హాసన్ , రజనీకాంత్ సినిమాలకు కమిట్ అవ్వడం తో సెట్ కాక ఈ ఇద్దరి స్టార్ల సినిమాలు మిస్ చేసుకోవాల్సి వచ్చింది . విచిత్రం ఏమిటంటే చిరంజీవి గారి సినిమాలలో ఆఫర్ వచ్చిన ప్రతిసారి, ఆ టైంకి నేను రజినీకాంత్ గారి సినిమా చేస్తూ బిజీగా ఉందేదాన్ని.. అందుకే ఇన్నిసార్లు ఛాన్స్  వచ్చిన చిరంజీవి తో సినిమాలు చేయలేకపోయాను .." అంటూ ఆమె చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: