జంతువులతో కలిసి నటించి హిట్ కొట్టిన సినిమాలు ఏంటో తెలుసా..?

Divya

సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అందుకే సినిమా విజయం సాధించడం కోసం ప్రతి ఒక్కరు చాలా శ్రమతో, శ్రద్ధతో పని చేస్తూ వుంటారు. ఇందులో ఏ పాత్ర బాగా లేకున్నా, ఆ సినిమా విజయం సాధించడం చాలా కష్టం.. ఇక అందులో భాగంగానే కొన్ని సినిమాలు నటీనటులు నటనకు హిట్టయితే, మరికొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువుల క్యారెక్టర్లు కూడా ఎంతో కీలక పాత్ర పోషించిన చిత్రాలు కూడా లేకపోలేదు.. ఇక వాటి కారణంగానే ఆ సినిమాలు అత్యంత విజయం సాధించాయని కూడా చెప్పవచ్చు.. అయితే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రాజేంద్రుడు -  గజేంద్రుడు :
1993 లో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాజేంద్రుడు-గజేంద్రుడు. ఈ సినిమాలో ఏనుగు కీలక పాత్రలో నటించింది. తన యజమాని చనిపోవడంతో అడవి నుంచి నగరానికి వచ్చి, రాజేంద్రప్రసాద్ తో స్నేహం చేస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ ను ఇబ్బందుల నుంచి కాపాడడానికి ఏనుగు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. చూసిన ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పిల్లలు, పెద్దలు ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్ లకి వెళ్లడం  గమనార్హం.
2. సాహస వీరుడు సాగర కన్య :
వెంకటేష్,మాల శ్రీ, శిల్పాశెట్టి సంయుక్తంగా కలిసి నటించిన చిత్రం సాహస వీరుడు సాగర కన్య.. ఇక ఇందులో శిల్పా సాగరకన్య గా నటించి,ప్రేక్షకుల మనసును గెలుచుకున్నది.
3. ఈగ :
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నాచురల్ స్టార్ నాని, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఈగ. విలన్ చేతిలో చనిపోయిన నాని ఆత్మ, ఈగ లోకి ప్రవేశించి, విలన్ పై రివెంజ్ తీర్చుకుంటుంది ఇక ఈ సినిమాలో ఈగ పాత్ర హైలెట్ గా నిలిచింది.
4. మృగరాజు :
మెగాస్టార్ చిరంజీవి,నాగబాబు,సిమ్రాన్ లు కలసి సంయుక్తంగా నటించిన చిత్రం మృగరాజు. ఈ సినిమాకు సింహం హైలెట్ గా నిలిచింది. సింహం బారి నుంచి జనాలను కాపాడేందుకు చిరంజీవి చేసే పోరాటం అందరిని ఆకట్టుకుంది.
ఇక ఇవే కాకుండా గోదావరి, సాహస బాలుడు విచిత్ర కోతి, అదుగో వంటి సినిమాలలో జంతువులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఇక వీటి కారణంగా సినిమా హిట్ అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: