యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది బ్లాక్ బస్టర్ కి 19 ఏళ్ళు .... దాని రేంజ్ అటువంటిది మరి ....??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారిగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ఆది. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాతగా తెరకెక్కిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా కీర్తి చావ్లా నటించగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దీనికి మ్యూజిక్ అందించారు. 2002లో సరిగ్గా ఇదే రోజున ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హీరోగా ఎన్టీఆర్ కి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
ఈ మూవీలో ఆది కేశవరెడ్డి గా ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు ఆయనని ఢీకొట్టే విలన్ పాత్ర లో నటించిన రాజన్ పి దేవ్ కి కూడా ఎంతో పేరు వచ్చింది. కాగా ఈ సినిమాలో ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, చలపతి రావు, రఘుబాబు, ఎమ్ ఎస్ నారాయణ నటించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు వి.వి.వినాయక్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. తొలి సినిమా అయినప్పటికీ కూడా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడు మాదిరిగా వినాయక్ ఈ మూవీని తీశారని ఇందులోని డైలాగ్స్, ఫైట్స్, సాంగ్స్ ని ఎప్పటికీ మర్చిపోలేము అని ఇప్పటికే ఎందరో ప్రేక్షకాభిమానులు చెప్తూ ఉంటారు.
అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా నేటితో సరిగ్గా 19 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్స్ సెట్ చేసి పరిగెత్తిస్తుండడంతో పాటు ఈ మూవీ యొక్క ప్రత్యేక షోని హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఆది మూవీ యూనిట్ కి హీరో ఎన్టీఆర్ కి దర్శకుడు వివి వినాయక్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పలువురు ఎన్టీఆర్ అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: