2015లో చనిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు ఎంత మందో తెలుసా..?

N.ANJI
చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటులు పరిచయం అవుతుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కరోనా సమయంలో ఎంత మంది నటులు చనిపోయారో.. అలాగే 2015లో కూడా అంతే మంది నటులు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 4న కేన్సర్ తో ఆహుతి ప్రసాద్ చనిపోయారు. ఆహుతి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదట్లో విలన్ గా మెప్పించి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో పాత్రలలో మెప్పించారు. జనవరి 5న సీనియర్ రచయిత గణేష్ పాత్రో కేన్సర్ తో పోరాడుతూ మరణించారు.
ఇక నిర్మాతగా, దర్శకునిగా రాణించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత రాజేంద్రప్రసాద్ జనవరి 12న మరణించారు. ఈయన జగపతిబాబు తండ్రి. ఇక మూవీ మొఘల్ గా అన్ని భాషల్లో సినిమాలు తీసి గిన్నీస్ బుక్ ఎక్కిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఫిబ్రవరి 18న అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 150సినిమాలు నిర్మించి ఎందరినో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమాటోగ్రాఫర్ విన్సెన్ట్ కూడా 86ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 25న మరణించారు.
అయితే నేషనల్ విన్నింగ్ ఎడిటర్ టీఈ కిషోర్ మార్చి 6న 32ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏప్రియల్ 18న ఈలోకం విడిచారు. గాయం, సింధూరం, ఆవిడా మా ఆవిడే వంటి సినిమాలకు సంగీతం అందించారు. సౌండ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి ఏప్రిల్ 20న హార్ట్ ఎటాక్ తో మరణించారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగర్వాల్ సర్జరీ ఫెయిల్ కావడంతో కన్నుమూశారు.
ఇక 1700కి పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఎం ఎస్ విశ్వనాథన్ 87ఏళ్ల వయస్సులో జులై 14న కన్నుమూశారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక వంటి సినిమాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు, అలాగే నటుడు మాడా వెంకటేశ్వరరావు, కమెడియన్స్ కళ్ళు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి, థియేటర్ ఆర్టిస్టు చాట్ల శ్రీరాములు, సీనియర్ నటుడు రంగనాధ్ కూడా ఈ ఏడాది మరణించారు. అప్ కమింగ్ యాక్టర్ ప్రశాంత్ లవ్ ఎఫైర్ వలన మేడమీది నుంచి దూకి నవంబర్ 13న ఆత్మహత్య చేసుకున్నాడు. టాప్ కమెడియన్ M.S.నారాయణ జనవరి 23న మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: