గిన్నిస్ బుక్ రికార్డు విజేత..విజయ నిర్మల నట ప్రస్థానం

Mamatha Reddy
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు సినిమాల మీద సినిమాలతో సక్సెస్ కొడుతుంటే బాపు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన సాక్షి సినిమాతో తెలుగు చలన చిత్ర సీమకి హీరోయిన్ గా విజయనిర్మల గారు పరిచయమయ్యారు. ప్రస్తుతం విజయవాడ గారు 75వ జయంతి జరుపుకుంటున్నారు.తెలుగులో లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా కొట్టారు.ఇండస్ట్రీలో మగవాళ్ల డామినేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఆమె సినిమాలను డైరెక్ట్ చేస్తూ సక్సెస్ లా మీద సినిమా సక్సెస్ ని కొట్టారు. ప్రముఖ నవలా రచయిత అయిన యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా నవల ని కృష్ణని హీరోగా పెట్టి ఆమె హీరోయిన్ గా చేస్తూనే దర్శకత్వం వహించి ఆ సినిమాని ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ గా నిలిపారు.తదనంతరం ఆమె కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణ గారితో పెళ్లికి ముందే విజయనిర్మల గారికి నరేష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. తెలుగులో జంబలకడిపంబ సినిమా లో హీరో గా చేసిన నరేష్ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు.
1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో ని తెలుగు కుటుంబంలో జన్మించారు.చిన్నప్పటి నుంచి విజయ నిర్మలలో చలాకీ తనం గమనించిన  తల్లితండ్రులు  ఆమెకు నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అక్కడి రాజా గారి విక్టోరియా కోటలో నృత్య ప్రదర్శన ఇచ్చి, రాజా వారి మెప్పును సంపాదించారు. తరువాత నిర్మల కుటుంబం మద్రాసు కు బదిలీ కావడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ఆమె బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఒక మహిళ  దర్శకురాలిగా ఇండస్ట్రీలో చాలా చిత్రాలకు దర్శకత్వం వహించి ఆడవాళ్ళు మగ వాళ్ళ కంటే తక్కువ కాదు అని నిరూపించారు. విజయనిర్మల గారు మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆమె దర్శకత్వంలో నేరము-శిక్ష చివరి సినిమా ఆమె ఫస్ట్ సినిమా సాక్షి అవగా దాంట్లో హీరోగా కృష్ణ గారు చేశారు ఆమె చివరి సినిమా కూడా కృష్ణ గారి తోనే చేశారు అది శ్రీ శ్రీ సినిమా. ఆవిడ చేసిన సినిమాలు సాక్షి’, ‘మీనా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పట్నవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’, పండంటి కాపురం’, ‘బొబ్బిలి దొర’, ‘శ్రావణమాసం’ తో ‘శ్రీశ్రీ’ వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.విజయ నిర్మల జూన్ 27 2019 న గుండెపోటుతో చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: