చరణ్, శంకర్ మూవీ పై చిరు ఆసక్తికర కామెంట్స్ !!

KISHORE
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే తరువాతి సినిమా పై సస్పెన్స్ విడింది. గత కొంత కాలంగా రాంచరణ్ తాను నటించే తరువాతి సినిమా పై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండ సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చారు. దీంతో ఎంతో మంది దర్శకుల పేర్లు సోషల్ మీడియా లో తెగ వినిపించినప్పటికి ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ తో తన 15 వ సినిమా ను అనౌన్స్ చేసి అభిమానులను ఒక్క సరిగా షాక్ గురి చేశాడు. చరణ్ 15 వ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు ఇండియన్ సినిమా ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ అని అదికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్ ట్విటర్ లో స్పందిస్తూ  ‘శంకర్‌ సార్‌ వంటి సినీ మేధావి దర్శకత్వంలో నా చిత్రం కూడా ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఎస్‌వీసీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో చెర్రి 15వ చిత్రం కాగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావడంతో  ఫ్యాన్స్ సంతోషానికి అవదులు లేవు. ఎందుకంటే శంకర్ దర్శకత్వం లో నటించాలని ప్రతి హీరో కోరుకుంటూ ఉంటాడు.
 అలాంటి గ్రేట్ డైరెక్టర్ తో తమ హీరో సినిమా ఉండడంతో మెగా ఫ్యాన్స్  సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ కాంబినేషన్ పై స్పందించారు. " ఎంతో ప్రతిభ, గొప్ప విజన్, ఇండియా గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన శంకర్ , చరణ్ తో చేతులు కలపడం ఆనందంగా ఉందని తెలిపారు. శంకర్ లాంటి దర్శకుడు ఎంతో మంది దర్శకులకు మార్గదర్శి అని, చరణ్- శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా చాలా గొప్ప సినిమా అవుతుందని" మెగా స్టార్ చిరంజీవి ట్విటర్ లో రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: