వార్ని .... టాక్ అలా ఉంటే ... మరి కలెక్షన్ ఏంటి ఇలా వస్తోంది ....??

GVK Writings
ఒక్కోసారి కొన్ని సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. టాక్ సూపర్బ్ గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ మాత్రం అంతగొప్పగా రాబట్టని సినిమాలు కొన్నైతే, టాక్ పెద్దగా లేనప్పటికీ మంచి కలెక్షన్ రాబట్టే సినిమాలు మరికొన్ని .ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇటీవల సంక్రాంతి కానుకగా ఇళయదళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
తమిళ్ తో పాటు తెలుగు సహా పాన్ ఇండియా మూవీ గా పలు భారతీయ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన రేంజ్ టాక్ ని దక్కించుకులేకపోయింది. తమిళ్ లో హీరో విజయ్ కి సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ ఉండడంతో అక్కడ ఈ సినిమా కలెక్షన్స్ వరద పారిస్తున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అక్కడ చెన్నై సహా పలు ఇతర ఏరియాల్లో మాస్టర్ దూసుకెళుతోందని అంటున్నారు. నిజానికి తమిళ్ తో పాటు దాదాపుగా మిగతా భాషలు అన్నింటిలోనూ కూడా ఈ సినిమాకి యావరేజ్ టాక్ రావడం జరిగింది. ఇక ఇటు తెలుగు లో కూడా ఈ సినిమా బాగానే కలెక్షన్స్ రాబడుతున్నట్లు చెప్తున్నారు. మొన్నటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుందని, అలానే నిన్నటి నుండి సినిమా లాభాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతుందని అంటున్నారు.
సినిమాలో మంచి కథ ఉన్నపటికీ, దానిని మరింత ఆకట్టుకునే విధంగా దర్శకుడు లోకేష్ తీసివుంటే తప్పకుండా సూపర్ హిట్ టాక్ లభించేదని, అలానే సినిమాకి భారీ రన్ టైం కూడా ఒకింత మైనస్ గా మారిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలో మాస్టర్ గా విజయ్, భవాని గా విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు అద్భుత నటనని కనబరచగా మూవీకి అనిరుద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ కి ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ లభిస్తోంది. మొత్తంగా విజయ్ నటించిన ఈ మాస్టర్ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు అయితే అందించనప్పటికీ ఒకింత బాగానే కలెక్షన్ దక్కించుకుంటూ కొనసాగుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: