ఈ టీవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Divya

ఈ టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాంలో నటిస్తున్న యాక్టర్స్ కు ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తూనే ఉంటారు. ఆ రెమ్యూనరేషన్  కూడా వారి ఇమేజ్ ను బట్టి పెరుగుతూ ఉంటుంది.అయితే ఈ టీవీ లో వస్తున్న  ప్రోగ్రామ్స్ లో ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో లో ఉన్న యాక్టర్స్ కు  మాత్రం  రెమ్యూనరేషన్ ఓ రేంజిలో అందుతోందని టాక్. అయితే ఆ రెమ్యూనరేషన్ అందరికీ ఒకే లాగ ఉందా? లేక ఎవరెవరికి ఎంత ఇస్తారు?అనే సందేహాలు నాతో పాటు మీకు కలగొచ్చు. ఇప్పుడు ఇలాంటి సందేహాలు అన్నింటికీ సమాధానం చెప్పే రోజు రానే వచ్చింది. జడ్జిలకు,యాంకర్లకు, యాక్టర్స్కు ,టీమ్ లీడర్లకు మల్లెమాల యూనిట్ ఎంత  ముట్ట చెబుతోంది అనే విషయం ఇప్పుడు  ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ప్రస్తుతం మనలో కొంతమంది  జబర్దస్త్ కామెడీ షో లో స్క్రిప్ట్ వేస్తున్న టీమ్స్ కు, ఆ ఎపిసోడ్ లో విజేత గా నిలిస్తే ఆ టీం కు మల్లెమాల యూనిట్ 25 వేల రూపాయల చెక్కును ఇస్తోంది. అని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కేవలం చూపించడానికి మాత్రమే అని ఎవరికి తెలియదు. ఆ చెక్కును తమ రేటింగ్ కోసం మల్లెమాల యూనిట్ చూపిస్తారు అంతే. కానీ నిజానికి జబర్దస్త్ లో ముందు నుంచి వస్తున్న వారికి ఒక రెమ్యూనరేషన్,కొత్తగా వచ్చిన వారికి ఇంకొక లాగ రెమ్యూనరేషన్, జడ్జిలకు,కో యాంకర్స్ కు ఇలా వేరువేరుగా రెమ్యూనరేషన్ ను ఇస్తున్నారు.

అయితే సాధారణంగా జబర్దస్త్ కామెడీ షో లో ఉన్న అన్ని టీముల సభ్యులకు మల్లెమాల యూనిట్ డబ్బులు ఇవ్వదు. ఒక్కో టీం కి,వారి టీం లీడర్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తోంది అంతే. ఆ టీం లీడర్ మిగతా సభ్యులకు సమానంగా డబ్బులు పంచడం జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా రెమ్యూనరేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం నెలకు నాలుగు షోలు మాత్రమే వస్తాయి. ఈ నాలుగు షోలు కలిపి రోజాకు నెలకు 25 లక్షల రూపాయల నుంచి రూ. 30 లక్షల వరకు ఇస్తున్నారట.
అలాగే సుమారు పది నెలల క్రితం వచ్చిన సింగర్ మనో కు రూ.10 లక్షలు నుంచి రూ.12 లక్షలు ఇస్తున్నారని టాక్. అలాగే సీనియర్ యాంకర్ అనసూయకు రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలు ఇస్తుంటే, రష్మీ కి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నారు. అలాగే  పాపులర్ టీం లీడర్స్  అయిన సుడిగాలి సుధీర్,హైపర్ ఆది కూడా రూ.4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఇస్తున్నారు. రీసెంట్ గా వచ్చి బాగా పాపులర్ అయిన ఇమ్మాన్యూయెల్  కూడా ఒకటిన్నర లక్ష నుండి రెండు లక్షల వరకు ఇస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: