తన షో లకి వచ్చే సెలబ్రిటీలకు ఆలీ ఎంత ఇస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Divya

సాధారణంగా బుల్లితెరపై ప్రోగ్రామ్స్ అనగానే చాలా రియాల్టీ షో లు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో వచ్చే పాటిస్పేట్స్ కి గానీ,సెలబ్రిటీలకు  గానీ  డబ్బులు ఇస్తున్నామని చూపిస్తారు.  అయితే ఎంత మాత్రం నిజంమో ఎవరికీ తెలియదు? కానీ కొన్ని షోలు రేటింగ్ కోసం ఇలా చేస్తే, మరికొన్ని షో లు నిజంగానే డబ్బులు ఇస్తాయి. అలాంటి కోవకు చెందిందే ఆలీతో సరదాగా ప్రోగ్రాం. ఈటీవీ షో అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆలీతో సరదాగా ప్రోగ్రాం. సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల క్రితం ఉన్న సెలబ్రిటీల వివరాలు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ సెలబ్రిటీలకు ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన సెలబ్రిటీలు ఇప్పుడు ఏం చేస్తున్నారో? అని అనుకుంటుంటారు.
కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా కు దగ్గరగా ఉంటే,మరి కొంతమంది అసలు సోషల్ మీడియా లోనే ఉండరు. ఇలాంటి వారి విషయాలు ఒకటి కూడా బయటికి పొక్కవు.కానీ ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో వారు మాత్రం పాత సెలబ్రిటీలను తీసుకొచ్చి, వారికి సంబంధించిన అన్ని విషయాలను మనతో  షేర్ చేసుకుంటున్నారు ఆలీ. అంతకుముందు మనల్ని అలరించిన ఎంతోమంది యాంకర్ లు  అలాగే సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు వచ్చి వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంటారు.
కానీ ప్రస్తుతం మనలో ఎవరికైనా అనుమానం కలవచ్చు.అదేంటంటే? ఈ షో కి వచ్చే వాళ్ళు ఎటువంటి పారితోషికం తీసుకోకుండా వస్తారా? లేదా డబ్బులు తీసుకుంటారా? అని.ప్రస్తుతం ఆలీతో సరదాగా వచ్చే ప్రోగ్రాం కి లక్ష రూపాయలు ఇస్తారు అని వార్త వినిపిస్తోంది. ఒకవేళ సినిమా ప్రమోట్ చేయడానికి వస్తే వారికి ఎలాంటి రెమ్యునరేషన్ అందదు.
అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకి ఫ్లైట్ ఖర్చులు, ఉండడానికి ఏర్పాట్లు కూడా నిర్మాతలు చూసుకుంటారు. ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో వచ్చే సెలబ్రిటీలకు వారి ఇమేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: