బాలయ్య బ్లాక్ బస్టర్ కి ఇరవయ్యేళ్ళు.. !

Satya
టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన మాస్ సబ్జెక్ట్ ఎంచుకుని మూవీ చేయాలి కానీ రికార్డులు బద్ధలు కావడం ఖాయం. ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరు. ఆయన వరస  ఫ్లాప్స్ మధ్యన ఒక బ్లాక్ బస్టర్ ఇస్తారు. అది అలా ఇలా ఉండదు, ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసి మోత మోగిస్తుంది.
పైగా బాలయ్యకు సంక్రాంతి హీరో అని పేరు. ఆయన సినిమా సంక్రాంతికి వస్తే చాలు అది సూపర్ హిట్ అని రాసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే 1999లో సమరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సంక్రాంతికి కొట్టిన బాలయ్య 2001 లో నరసింహనాయుడు మూవీతో వెండి తెరను టచ్ చేశాడు. 2001 జనవరి 11న రిలీజ్ అయిన ఈ మూవీ సింహ గ‌ర్జనే చేసింది.
బాలయ్య ఫ్యాన్స్ చేసిన సౌండ్స్ కి సినిమా హాళ్ళు కేక పెట్టాయి. ఈ మూవీ సృష్టించిన రికార్డులు చాలానే ఉన్నాయి. అత్యధిక కలెక్షన్లు వసూల్ చేయడమే కాదు. అత్యధిక సెంటర్లలో మూవీ రన్ అయింది. అలాగే వంద రోజులు, రెండు వందల రోజులు మూడు వందల రోజులు కూడా ఆడి బాలయ్య స్టామినాని ఇది అని రుజువు చేసింది. ఈ మూవీ లో లక్స్ పాపా లంచ్ కొస్తావా సాంగ్ ఇప్పటికీ కేక పెట్టిస్తుంది. చీలకపచ్చ చీరా అంటూ సిమ్రాన్ తో బాలయ్య వేసిన స్టెప్స్ అదరగొడతాయి.
ఈ మూవీని బీ గోపాల్ డైరెక్ట్ చేస్తే చిన్ని క్రిష్ణ కధను అందించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ తో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలయ్య నట విశ్వరూపమే ఈ సినిమా చూపించింది. బాలయ్య నటనకు నంది అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి మృగరాజు రిలీజ్ అయింది. కానీ నరసింహనాయుడే సంక్రాంతి విజేతగా నిలవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: