వెన్నెల కిశోర్ అక్కడ టాలెంట్ చూపాలనుకుంటున్నాడు.. క్రేజీ డైరక్టర్ తో డీల్ ఫిక్స్..!

shami
వెన్నెల సినిమాతో తెరకు పరిచయమైన వెన్నెల కిశోర్ ఆ తర్వాత తన కామెడీతో మెప్పిస్తూ వచ్చాడు. స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న వెన్నెల కిశోర్ స్టార్ హీరోల నుండి యువ హీరోల దాకా సినిమాలు చేస్తూనే వచ్చాడు. వరుస సినిమాలు చేస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తున్న వెన్నెల కిశోర్ తనదైన శైలిలో కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా అతని కామెడీని చూపించాలని ఫిక్స్ అయ్యారు. వెన్నెల కిశోర్ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పినట్టు టాక్.
అదికూడా నీది నాది ఒకే కథ సినిమాతో ప్రతిభ చాటిన వేణు ఊడుగుల అందించిన కథతో వెబ్ సీరీస్ చేస్తున్నాడట. ఈ వెబ్ సీరీస్ ను వేణు ఊడుగుల అసోసియేట్స్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే వేణు ఆహా కోసం చలం మైదానం ను వెబ్ సీరీస్ లుగా తీస్తున్నారు. ఇక ఇప్పుడు వెన్నెల కిశోర్ కోసం కొత్త కథలతో వస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతో కూడా వెన్నెల కిశోర్ ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యాడు.
వెన్నెల కిశోర్ టాలెంట్ ను వెబ్ సీరీస్ కోసం కూడా వాడేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. వేణు ఊడుగుల డైరక్షన్ లో వెన్నెల కిశోర్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి. వెబ్ సీరీస్ లో కూడా ఈమధ్య మంచి కంటెంట్ తో వస్తున్నాయి. వెన్నెల కిశోర్ అక్కడ కూడా తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: