రైటర్ పద్మభూషణ్.. సుహాస్ రెండో సినిమా సూపర్ కంటెంట్..!

shami
చాయ్ బిస్కెట్ లో తన యాక్టింగ్ టాలెంట్ తో మెప్పించిన సుహాస్ ఈమధ్య సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కనిపిస్తూ వచ్చాడు. రీసెంట్ గా కలర్ ఫోటోతో హీరోగా మారి సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుహాస్. సుహాస్ హీరోగా నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్పుడే మొదలైంది. ఈసారి చాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ వారు కలిసి చేస్తున్న మొదటి సినిమాలో సుహాస్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా రైటర్ పద్మభూషణ్ అని ఫిక్స్ చేశారు. రైటర్ పద్మభూషణ్ పాత్రలో సుహాస్ కనిపించనున్నాడు.
నూతన దర్శకుడు షణ్ముక ప్రశాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సుహాస్ రైటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. కథల పరంగా సుహాస్ చాలా కలర్ గా వ్యవహరిస్తున్నాడని చెప్పొచ్చు. రైటర్ పద్మభూషణ్ ఎంటర్టైనర్ సినిమాగా వస్తుంది. చాయ్ బిస్కెట్ మొదటి ప్రొడక్షనల్ వెంచర్ కాబట్టి అన్ని తగిన జాగ్రత్తలతోనే సినిమా చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ కలర్ ఫోటో సక్సెస్ ఫుల్ సినిమా అయ్యింది కాబట్టి రెండో సినిమాను కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నారు.
రైటర్ పద్మభూషణ్ ఏం చేస్తాడు.. సుహాస్ ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకులను అలరిస్తాడు అన్నది త్వరలో తెలుస్తుంది. రైటర్ పద్మభూషణ్ పోస్టర్ తోనే తొలీడుగు సూపర్ అనిపించుకుంది. తొలీడుగు బుక్ ను పెట్టుకుని సరదాగా కనిపిస్తున్న సుహాస్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: