బిగ్ బాస్ : 15వ వారం , 4వ రోజు ఓటింగ్.... ఊహించని విధంగా పూర్తిగా వెనకబడ్డ ఆ హౌస్ మేట్ .....??

GVK Writings
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ప్రతిష్టాత్మక షో చివరి వారానికి చేరుకోవడంతో పాటు మరొక రెండు రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌస్ నుండి అనేక మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా ప్రస్తుతం ఫైనలిస్ట్ లు గా మొత్తంగా ఐదుగురు మాత్రం హౌస్ లో మిగిలారు. కాగా వారు ఎవరంటే అభిజీత్, అరియానా, అఖిల్, సోహెల్, హారికా. ఇక వీరిలో ఎవరికీ వారికీ బిగ్ బాస్ లో మంచి పేరు దక్కడంతో పాటు మంచి ఓటింగ్ కూడా నమోదవుతోంది.
ఇకపోతే ఓటింగ్ కి ఇదే ఆఖరి వారం కావడంతో హౌస్ మేట్స్ యొక్క అభిమానులు తమ ఫెవరెట్ కంటెస్టెంట్స్ కి వీలైనంత గా ఓట్లు వేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్ లో విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై అందరిలో ఒకటే ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఈ 15వ వారం 4వ రోజు వోటింగ్ పోల్స్ యొక్క ఫలితాల ప్రకారం కొన్ని అనధికారిక సోషల్ మీడియా పోల్స్ నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, అందరికంటే ముందుగా ఎప్పటివలె అభిజీత్ దూసుకెళ్తుండగా రెండు, మూడు స్థానాల కోసం అరియనా, సోహెల్ ల మధ్య పోటీ జరుగుతోందని, అయితే ఊహించనివిధంగా అఖిల్ సార్థక్ నాలుగవ స్థానానికి పడిపోగా అందరికంటే చివరిగా అత్యల్ప వోటింగ్ తో హారిక కొనసాగతున్నట్లు టాక్.
నిజానికి మోనాల్ ఓట్లు కూడా అఖిల్ కి పడుతున్నప్పటికీ కూడా అతడు సోహెల్, అరియానా లను మాత్రం అందుకోలేకపోతున్నాడని వినికిడి. అయితే మరొక్కరోజు వోటింగ్ కి సమయం మిగిలి ఉండడంతో ఏమైనా ఈ విషయమై జారొగొచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ తాజా సీజన్ లో విజేతగా ఎవరు నిలుస్తారో తెలియాలి అంటే మరొక రెండు రోజులు వెయిట్ చేయాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: