15వ వారం 2వ రోజు ఓటింగ్ : సెకండ్ ప్లేస్ కోసం ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ మధ్య భారీ పోటీ ....??

GVK Writings
ఇప్పటికే తెలుగు టెలివిజన్ తెరపై కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రేక్షకాభిమానుల్లో మరింతగా ఉత్సాహాన్ని నింపింది అనే చెప్పాలి. మరోవైపు మరొక్క ఐదు రోజుల్లో షో ముగియనుండటంతో ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే దానిపై అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇటీవల అవినాష్, మోనాల్ హౌస్ నుండి వెళ్ళిపోయిన తరువాత మొత్తం చివరిగా ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.
అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో అభిజీత్ మాత్రం అందరికంటే ముందుగా ఎప్పటివలె భారీ వోటింగ్స్ తో దూసుకెళ్తున్నట్లు టాక్. కాగా రెండు, మూడు స్థానాల విషయమై ప్రస్తుతం భారీ పోటీ జరుగుతుందని టాక్. ఇప్పటికే రెండు రోజులు వోటింగ్ పోల్స్ ముగియడంతో కొన్ని అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ సమాచారాన్ని బట్టి రెండు, మూడు స్థానాలకు సోహెల్, అరియనా, అఖిల్ మధ్య విపరీతమైన పోటీ వోటింగ్ జరుగుతోందని, మొదటి రోజు రాత్రి వరకు అరియనా రెండవ స్థానంలో నిలవగా రెండవ రోజు ప్రారంభం సమయంలో సోహెల్ ఒక్కసారిగా దూసుకురాగా, అలానే రెండవ రోజు ముగింపు సమయానికి అనూహ్యంగా అఖిల్ సార్థక్ రెండవ ప్లేస్ లోకి దూసుకువచ్చాడని అంటున్నారు.
అయితే ఈ మూడవ రోజు సహా మరొక మూడు రోజులు వోటింగ్ ఉంది కనుక, అది పూర్తి అయిన తరువాతనే ఈ స్థానాల విషయమై పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తాజా బిగ్ బాస్ 4 వ సీజన్ ముగింపు దశకు చేరుకోవడం అన్ని వర్గాల పేక్షకుల్లోను షో పై మరింతగా ఆసక్తిని పెంచడంతో పాటు తద్వారా షో కి విపరీతంగా రేటింగ్స్ ని తెచ్చిపెడుతోందని అంటున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: