15వ వారం ....తొలిరోజు ఓటింగ్ లో వెనుకబడ్డ ఆ టాప్ కంటెస్టెంట్ .....??

GVK Writings
ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికే చివరి వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల 13వ వారం ముక్కు అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా, నిన్న 14వ వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజీత్, అఖిల్, అరియనా, సోహెల్, హారిక లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు రన్నర్ గా ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే దానిపై ప్రేక్షకులు అలానే బిగ్ బాస్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు తమదైన అట తీరుతో ప్రేక్షకుల నుండి మంచి పేరు, వోటింగ్స్ దక్కించుకున్నవారే అని చెప్పాలి. అయితే ఇది ఆఖరి వారం కావడంతో ఎవరి సత్తా ఎంతవరకు ఉందో మరికొద్దిరోజుల్లో తెలియనుంది. అయితే ఈ తాజా 15వ వారం మొదటి రోజు కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాకు అందుతున్న వోటింగ్ రిజల్ట్స్ ని బట్టి చూస్తే ఎప్పటివలె అభిజీత్ మొదటి స్థానంలో దూసుకెళ్తుండగా, ఆ తరువాత సోహెల్, అలానే అరియనాలు దూసుకెళ్తున్నారని, అయితే అఖిల్ సార్థక్ మాత్రం మొదటి రోజు కొంత వెనుకబడ్డాడని, ఇక అతడి తరువాత అందరికంటే చివరి స్థానంలో దేత్తడి హారిక ఉందని అంటున్నారు.
అయితే ఇది కేవలం తొలి రోజు వోటింగ్ మాత్రమే అని మరొక నాలుగు రోజులు వోటింగ్ కి మిగిలి ఉండడంతో ఏమైనా జరగొచ్చని పలువురు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు విన్నర్ గా ఎవరు రన్నర్ గా నిలుస్తారో, ఎవరెవరు బయటకు వెళ్తారో తెలియాలంటే మరొక్క ఆరు రోజులు ఓపికపట్టాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: