బిగ్ బాస్ 4 : 14వ వారం నామినేషన్ లో ఉండబోయేది వీరే ....??

GVK Writings
తెలుగు టెలివిజన్ తెరపై భారీ స్థాయి రేటింగ్స్ అలానే ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న షోల్లో స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ షో యొక్క నాలుగవ సీజన్ ప్రస్తుతం 13వారాలు పూర్తి చేసుకోగా ఈరోజు హౌస్ నుంచి మొత్తం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురులో అవినాష్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయాడు. ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భాగంగా అవినాష్ అలానే మౌనాల్ ల మధ్య తీవ్ర పోటీ జరిగిందని చివరికి మోనాల్ ఒకింత భారీ స్థాయి ఓటింగ్ దక్కించుకుని అవినాష్ వెనకబడటంతో అతడు ఈ రోజు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడని చెబుతున్నారు.
ఇకపోతే రేపటినుంచి ఈ సీజన్ 14 వారంలోకి అడుగుపెట్టబోతోంది. కాగా కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి రేపటి వారం ఎలిమినేషన్ లో ఉండబోయే కంటెస్టెంట్ లు సోహైల్, అరియానా, అభిజిత్, మోనాల్ మరియు హారిక అని సమాచారం. అవినాష్ హౌస్ నుంచి నిష్క్రమించడంతో హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో గ్రాండ్ ఫినాలే కి చేరిన అఖిల్ మినహాయిస్తే మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉన్నట్లు సమాచారం.  అలానే రాబోయే వారం ఇప్పటి వరకు కొనసాగిన మిగతా వారాలతో పోల్చుకుంటే మరింత టఫ్ గా సాగనుందని అలానే బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ కు మరింత కష్టతరమైన టాస్క్ లు ఇవ్వనున్నారని అంటున్నారు.
ఇప్పటికే మరొక రెండు వారాల్లో ఫినాలే షో ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారాన్ని బట్టి  అతి త్వరలో జరగబోయే ఈ షో యొక్క గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరో ఒకరు ప్రత్యేక అతిథిగా రానున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాబోయే వారాలు బిగ్ బాస్ సీజన్ 4 షో మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: