13వ వారం బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్ .... స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ .....??

GVK Writings
ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 షో మరొక రెండు వారాల్లో ముగియనున్న విషయం తెలిసిందే. గడచిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ తాజా సీజన్ ని మరింత ఆసక్తికరమగా ముందుకు తీసుకెళ్తున్నారు హోస్ట్ నాగార్జున. మరోవైపు బిగ్ బాస్ కూడా ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరికీ మంచి ఆసక్తికరమైన టాస్క్ లు ఇస్తూ షోపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
ఇక ఇటీవల చేరుకున్న 13వ వారంలో భాగంగా మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే. వారెవరంటే అభిజీత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక. నేటితో వీరి వోటింగ్ పోల్స్ ముగియడంతో వీరిలో ఎవరెవరికి ఎంత శాతం ఓట్స్ వచ్చాయి, ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్తారు అనే దానిపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు ఇటీవల రెండు రోజులు వోటింగ్ పోల్స్ టెక్నీకల్ సమస్యల వలన సరిగ్గా పనిచేయకపోవడంతో ఎలిమినేషన్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు వచ్చిన మిస్డ్ కాల్ ఓట్స్ ని పరిగణలోకి తీసుకోనున్నారు అనేటువార్త రెండు రోజుల నుండి ప్రచారం అవుతోంది.
ఇకపోతే వోటింగ్స్ ప్రకారం మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ వారం హౌస్ నుండి మోనాల్ గజ్జర్ ఎలిమినేటి అయ్యే ఛాన్స్ గట్టిగా ఉందని అంటున్నారు. నిజానికి చివరి రెండు రోజులు వోటింగ్ లో అవినాష్, మోనాల్ మధ్య కొద్దిపాటి గట్టి పోటీ జరిగిందని, అయితే చివర్లో అవినాష్ కి కొంత బాగానే వోటింగ్ రావడంతో మోనాల్ వెనుకబడిందని అంటున్నారు. మరి మొదటి నుండి హౌస్ లో స్ట్రాంగ్ గా ఆడుతూ కొనసాగుతున్న మోనాల్ నిజంగానే ఈవారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరొక్క రోజు వరకు వెయిట్ చేయాలి ...!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: