13వ వారం బిగ్ బాస్ లో ఊహించని షాక్ .... ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ....??

GVK Writings
ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4. ఇప్పటికే గడిచిన మూడు సీజన్స్ ప్రేక్షకుల అభిమానంతో ఆకట్టుకునే రేటింగ్స్ తో భారీగానే దూసుకెళ్లాయి. ఇక గత సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో సీజన్ కి కూడా తనదైన హోస్టింగ్ టాలెంటుతో షో ని మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇకపోతే ఈ షో ఇప్పటికే 12 వారాలకు పైగా కొనసాగి ఇటీవల 13 వారంలోకి అడుగుపెట్టింది.
ఇక ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, హారిక తదితరులు ఎలిమినేషన్ జోన్లో ఉండగా వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనేదానిపై ప్రేక్షకాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు పలు అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్  ద్వారా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే అభిజిత్, అఖిల్ భారీ స్థాయి ఓటింగ్ తో కొనసాగుతుండగా ఆ తర్వాత  అవినాష్ అలానే హారిక కూడా మంచి ఓటింగ్ సంపాదించుకుని దూసుకెళ్తున్నారు అని అంటున్నారు. అయితే వీరందరి కంటే చివరిగా ఒకింత తక్కువ స్థాయి ఓటింగ్ తో మోనాల్ వెనుకబడిందని సమాచారం. నిజానికి గడిచిన రెండు రోజుల్లో మోనాల్ ఒకింత ముందు స్థానంలో ఉన్నప్పటికీ  నిన్నటి నుంచి ఆమె కొంత వెనుకబడిందని అలాగే ఆమెకు ఓట్స్ కూడా బాగా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు.
అయితే ఆమె ఇప్పటివరకు వెనకబడినప్పటికీ నష్టపోయేది ఏమీ లేదని, ఎందుకంటే ఓటింగ్ కి మరొక రోజు మిగిలి ఉండటంతో ఈ సమయంలో ఏమైనా జరగొచ్చని పలువురు మోనాల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వారం హౌస్ నుంచి అవినాష్ కూడా బయటకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని ఎందుకంటే అవినాష్ కి అలానే మోనాల్ కి మధ్య ఓటింగ్ చాలా తక్కువ పర్సంటేజ్ తేడా మాత్రమే ఉందని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈవారం హౌస్ నుంచి ఎక్కువ శాతం బయటకు వెళ్లే వారిలో అయితే మోనాల్ లేదా అవినాష్ ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి 13వ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే మరొక మూడు రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: