సీనియర్ హీరోలు వెనక్కు తగ్గాల్సిందేనా...?

Satya
టాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ హీరోలు ఉన్నారు. వారంతా ఇప్పటికీ నాటౌట్ అంటూ తెగ బిజీగా ఉన్నారు. నిజానికి భారతీయ చలన చిత్రసీమలో ఒక్క టాలీవుడ్ తప్ప మిగిలిన చోట్ల అరవైలు దాటిన వారు ఆడి పాడడంలేదు. తమ వయసుకు తగిన పాత్రలలోనే లేక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తూనే వస్తున్నారు. కానీ టాలీవుడ్ లో మాత్రమే హీరోలకు డ్యూయట్లు కావాలి. హీరోయిన్లు కూడా కావాలి. దాంతో ఎక్కడలేని సమస్యలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కరొనా వచ్చిన తరువాత షూటింగులు మొదట్లో లేకుండా పోయాయి. ఇపుడు నెమ్మదిగా సెట్స్ మీదకు అంతా వస్తున్నారు. అయితే ఇపుడు కూడా కుర్ర హీరోల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జున తప్ప మిగిలిన వారు సెట్స్ కి  రాలేదు. ఇపుడు టైం చూసుకుని ఆచార్య షూటింగులో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్ అయ్యారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ నెల 15 తరువాత బాలక్రిష్ణ, వెంకటేష్ కూడా షూటింగులో తిరిగి జాయిన్ అవుతారని టాక్ వస్తోంది. చూస్తూంటే కరోనా ఎక్కడా తగ్గలేదు.  దానికి సాక్ష్యం చిరంజీవి  వంటి మెగాస్టార్.   అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆ  నటుడే కరోనాకు గురి కావడం. ఇక షూటింగులు అంటూ మొదలుపెడితే కచ్చితంగా  ఏదో విధంగా కరోనా వ్యాపించక మానదు అంటున్నారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట కచ్చితంగా కరోనా వ్యాపించేలాగే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. అందువల్ల సీనియర్ హీరోలు మరికొన్నాళ్ళు తన షూటింగులను వాయిదా వేసుకోవడమే మంచిదని అన్ని వైపుల నుంచి సూచనలు వస్తున్నాయి. పైగా సెకండ్ వేవ్ కూడా ఉందని వార్తలు వస్తున్న వేళ జాగ్రత్తలు మన హీరోలు పాటించాలని అంటున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: