కరెక్ట్ సినిమా కోసం చూస్తున్న కుమారి హెబ్భా..!
సినిమాలో చిన్న చిన్న పాత్రలను సైతం చేస్తూ వస్తుంది. కరెక్ట్ సినిమా పడితే ఇప్పటికైనా ఆమె సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు. సంపత్ నంది రాసిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది హెబ్భా పటేల్. థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో హెబ్భా హిట్ ట్రాక్ ఎక్కుతుందని అంటున్నారు. గ్లామర్ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టని ఈ అమ్మడికి సరైన ఛాన్స్ రావట్లేదు.
టాలీవుడ్ లో ఓ ఐడెంటిటీ వచ్చాక కూడా వెనకపడ్డది హెబ్భా పటేల్. మరి చేస్తున్న సినిమా హిట్టు పడితే ఏదైనా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికి హెబ్భా తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. తప్పకుండా అమ్మడు తన సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు. తనకు వచ్చిన క్రేజ్ తో స్టార్ అవకాశాలు దక్కించుకోలేని హెబ్బా ఇక మీదట రూట్ మార్చి మరింత రెచ్చిపోవాలని చూస్తుంది. అలా చేస్తే మాత్రం అమ్మడి ఫేట్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం రాం రెడ్ సినిమాలో హెబ్భా ఓ హాట్ స్పెషల్ సాంగ్ చేసింది.