హైపర్ ఆది దెబ్బకు బ్రహ్మానందం పరేషాన్..!

N.ANJI
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ హైపర్ ఆది. తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక అప్పట్లో కత్తి మహేష్‌తో గొడవ పడినపుడు హైపర్ ఆది టెంపర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కూడా అవసరం అయిన ప్రతీసారి ఆది కామెంట్స్ కాంట్రవర్సీ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా జబర్దస్త్ వేదికపై స్కిట్స్‌లో రాసే డైలాగులు బయట చాలా మంది మనోభావాలను కూడా దెబ్బ తీస్తుంటాయి. అయినా కూడా అన్నీ కామెడీనే అంటుంటాడు హైపర్ ఆది.
ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్న కూడా ఆది మాత్రం తన రూట్ మార్చుకోడు. ఈ ఆటిట్యూడ్‌తోనే ఓ సారి ఏకంగా లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందానికి కూడా చుక్కలు చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. ఈ మధ్యే ఓ టాక్ షోకు వచ్చిన ఆది.. అక్కడ తనకు ఎదురైన విచిత్రమైన అనుభవం గురించి చెప్పాడు. ఓ సారి బ్రహ్మానందం తనకు కాల్ చేస్తే.. ఎవరో అనుకుని ఆడుకున్నానని చెప్పాడు. హలో నేను బ్రహ్మానందం అంటూ వాయిస్ వచ్చిందని.. అది విన్న హైపర్ ఆది అయితే ఏంటి ఇక్కడ హైపర్ ఆది అంటూ సమాధానమిచ్చాడు.
అది కాదయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా.. అంటే అదేనయ్యా నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నా అంటూ మాటకు మాట జవాబు ఇచ్చాడంట ఆది. అప్పుడు మరోసారి అయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా అంటూ సీరియస్‌గా చెప్పేసరికి అప్పటికి అసలు విషయం బోధ పడిందని తెలిపాడు ఆది. తన ఫ్రెండ్స్ అప్పుడప్పుడూ ఇలాగే కాల్ చేసి ఆట పట్టిస్తుంటారని.. అందుకే తాను అలా మాట్లాడానని కానీ వెంటనే క్షమాపణ చెప్పానని గుర్తు చేసుకున్నాడు హైపర్ ఆది. ఈ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా కూడా నవ్వుకుంటానని చెప్పాడు ఈయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: