హైదరాబాద్ వరదల పై రొమాంటిక్ హీరో హాట్ కామెంట్స్..

Satvika
హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది..అంతేకాదు ఇప్పటికీ ఇళ్లలోకి చేరిన వరద నీరు తగ్గలేదు.. అలానే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి. భారీ గా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. పసి కందులు కూడా వర్షం దాటికి ఆగలేక పోయారు.. గత వందేళ్ల లో ఎన్నడూ లేనివిధంగా కురిసిన. వరద కుటుంబాలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వారి కుటుంబాలను ఆర్దికంగా ఆదుకున్నారు.

ఈ మేరకు ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవర కొండ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో దుమారం రేపాయి. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారడమే కాదు.. ఎన్నో చర్చలకు దారితీసాయి. ఆయన చేసిన ట్వీట్ పై కొందరు ఏకీభవి స్తున్నారు.. మరి కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అయిన విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ చిన్న విషయాన్ని చిలికి చిలికి పెద్దది చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు... హైదరాబాద్ ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం పై స్పందించిన విజయ్ దేవరకొండ మాత్రం మరోసారి ఆసక్తి కర పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.హైదరాబాద్‌.. ఇలాంటి సమయంలో నేను అందుబాటులో లేనందుకు చాలా బాధగా ఉంది. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నా.. తొందరగా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను.." అని విజయ్‌ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు మాత్రం భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అవి ట్రెండ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఫైటర్ టైటిల్ ను ఖారుర్ చేశారు..ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: