బాలీవుడ్ పై వర్మ సెటైర్లు.. స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ..?

praveen
టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో  అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి సంఘటనలపై సినిమాను తెరకెక్కించాలని వర్మ డిసైడ్ అవుతారో  అన్నది కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. లాక్ డౌన్  సమయంలో ఎక్కడ సినిమాలు ఆపకుండా.. వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ విడుదల చేసి లాక్ డౌన్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయారు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ తన సినిమాలతో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంటారు.

 వర్మ తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడుతున్నాయా  లేదా అనే విషయాలను కూడా పట్టించుకోకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తు  ఉంటారు రాంగోపాల్ వర్మ. అందుకే ఆయన ఏంచేసినా సంచలనంగా  మారిపోతూ ఉంటుంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు రాంగోపాల్ వర్మ. జాతీయ మీడియా బాలీవుడ్ పరువు  తీస్తుంది అంటూ కొన్ని నిర్మాణ సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 పలు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చెయ్యటం  ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పరువు పోతుంది అంటూ పలు నిర్మాణ సంస్థలు తిరుగుబాటు చేసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో బాలీవుడ్కు చెందిన 38 సంస్థలు మరియు నాలుగు ప్రధాన అసోసియేషన్స్  కూడా ఉన్నాయి. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్,  సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్,  కరణ్ జోహార్,  ఆదిత్య చోప్రా కు చెందిన పలు సంస్థలు కూడా ఉండడం గమనార్హం. ఇటీవల దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ రియాక్షన్ చాలా ఆలస్యమైంది.. ఇక బాలీవుడ్ హీరోలు అందరూ స్కూల్ పిల్లల్లా  హైకోర్టుకు వెళ్లి టీచర్ టీచర్ మమ్మల్ని అర్నాబ్  తిడుతున్నాడు అంటూ చెప్పి నట్లు ఉంది అంటూ సెటైర్లు వేశాడు రాంగోపాల్ వర్మ. కాగా వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం  వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: