సెగలు రేపుతున్న సమంతా లేటెస్ట్ ఫోటో షూట్

Chaganti
సమంతా అక్కినేని, ఎక్కడో చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిపొయింది. అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగచైతన్యను వివాహమాడి పర్మనెంట్ గా తెలుగు వారి కోడలిగా ఇక్కడే సెటిల్ అయిపొయింది. అయితే పెళ్లి తరువాత హీరోయిన్స్ కెరీర్ ఫేడవుట్ అవుతుందని భావిస్తారు. అందుకే చాలా మంది భామలు ముదిమి మీద పడుతున్నా పెళ్లి పెటాకులు లేకుండా ఇంకా నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని చూస్తూ ఉంటారు. కానీ సమంతా అలా కాదు, చక్కగా వయసుకి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా చక్కగా సినిమాలు చేస్తూ పోతోంది. ఈమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆ విషయాన్ని మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాలు ఋజువు చేశాయి కూడా.  

అయితే ఈమె తెలుగులో చివరిగా జాను సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఆమె సినిమాల విషయంలో సైలెంట్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఏకమ్ అనే ప్రీ స్కూల్, సాకి అనే బట్టల నిజిన్స్ మొదలు పెట్టి వాటిని నిలబెట్టుకునే పనిలో పడింది. అయితే పెళ్లి తర్వత సినిమాల్లో గ్లామరస్ పాత్రలు చేయడం ఆపేసిన ఆమె సోషల్ మీడియాలో అందాలూ అరబోస్తోంది.

 మ్యాగ్‌జైన్ కవర్‌ పేజస్ అని, అలాగే ఫొటోషూట్స్‌ అని ఏదో ఒక వంకతో ఆమె అందాలు ఆరబోసే పనిలోనే ఉంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో షూట్ కూడా సెగలు రేపుతోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సిరీస్‌ అని క్యాప్షన్ పెట్టి ఆమె కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ రీచ్‌ అయిన సందర్భంగా.. తనని ఫాలో అవుతున్న అందరికీ గ్రాటిత్యుడ్  తెలుపుతూ ఈ స్పెషల్‌ ఫొటోషూట్ స్టిల్స్‌ని సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: