కరోనా టైమ్ లో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న డైరక్టర్..

Murali
ప్రస్తుత కరోనా సమయాన్ని దర్శకుల్లో చాలా మంది కథలు రాసుకునే పనిలో ఉన్నారు. కొందరు పూర్తైన స్క్రిప్టులకు మెరుగులు దిద్దుకుంటున్నారు. సంపత్ నంది కూడా అదే పనిలో ఉన్నాడు. టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న డైరక్టర్స్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు సంపత్ నంది. మినిమం గ్యారంటీ సినిమాలే చేస్తున్న సంపత్ నంది తన మార్కెట్ ని నిలుపుకుంటున్నాడు. సంపత్ నంది సినిమాలు సూపర్ హిట్స్ కాకపోయినా అతని పనితనంపై నిర్మాతలు నమ్మకం ఉంచుతున్నారు. ఇదే అతనిలోని టాలెంట్ కు నిదర్శనం. తన కథలతో ప్రస్తుతం 3 సినిమాలు తెరకెక్కడం విశేషం.

సంపత్ నందిలో దర్శకుడే కాకుండా మంచి కథా రచయిత కూడా ఉన్నాడు. తన సినిమాలకు స్వయంగా కథ, మాటలు రాసుకుంటాడు. ప్రస్తుత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కథలు రాస్తున్నాడు. ఈ కథలు వేరే దర్శకులు కథలుగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బ్లాక్ రోజ్’ సంపత్ నంది రాసిన కధే. ఇప్పుడు ‘ఓదెల రైల్వే స్టేషన్’ పేరుతో మరో కథ రాసుకున్నాడు. ఈ కథ కూడా సినిమాగా తెరకెక్కుతోంది. టైటిల్ ఫస్ట్ లుక్ ఇటివలే రివీల్ చేసారు మేకర్స్. అశోక్ తేజ అనే దర్శకుడి సినిమాకు కూడా కథను అందించాడు.


ప్రస్తుతం సంపత్ నంది తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సీటీమార్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి బ్లాక్ రోజ్ ను తెరకెక్కిస్తున్నారు. మిగిలిన రెండు కథలను నిర్మాతగా కెకె రాధామోహన్ సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇలా సంపత్ నంది తనతో సినిమాలు చేసిన, చేస్తున్న వారిని తన కథలతో మెప్పిస్తున్నాడు. సంపత్ నందిలోని టాలెంట్ కు ఇది నిదర్శనం అని చెప్పాలి. ప్రస్తుతం కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ – తమన్నా జంటగా సీటీమార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: