కందిరీగ కాంబోలో మూవీ.. రామ్ అదిరిపోయే ప్లాన్..!
అప్పటివరకు కెమెరా మెన్ గా చేసిన సంతోష్ శ్రీనివాస్ రామ్ హీరోగా కదిరీగ సినిమాతోనే డైరక్టర్ గా సక్సెస్ కొట్టాడు. ఎన్.టి.ఆర్ తో రభస సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగాడు. పవర్ స్టార్ సినిమాతో సినిమా అనుకోగా అది క్యాన్సిల అయ్యింది. రాం తో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమా కందిరీగ సీక్వల్ గా వస్తుందని అంటున్నారు. అయితే ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ కాంబోలో సినిమా అనగానే అందరికి కందిరీగ సినిమా గుర్తొస్తుంది. మరి ఈ కాంబో రిపీట్ అవడంతో మళ్ళీ ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. రెడ్ తర్వాత రామ్ చేసే సినిమా ఇదే అని అంటున్నారు. స్టార్ సినిమాలతో సినిమాలు ప్రయత్నించిన సంతోష్ శ్రీనివాస్ రాం తో సినిమా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ రెడ్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక కందిరీగ కాంబో కూడా ఫిక్స్ అయితే రాం కెరియర్ మళ్లీ గాడిన పడినట్టే.