సంజయ్ దత్..జీవితమంతా సమరమే...!

Satya
సంజయ్ దత్..బాలీవుడ్ హీరో. టాప్ రేంజికి వెళ్ళిన ప్రతీ సారి ఆయన వివాదాల్లో కూరుకుపోతూ వచ్చాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉందంగా ఆయన్ని ఇరకాటంలో పెట్టే ఘటనలు ఎన్నో వరసగా  జరిగాయి. సంజయ్ దత్ గుండె గట్టిది. వాటిని తట్టుకుని నిలబడుతూ వచ్చాడు. సంజయ్ దత్ నంబర్ వన్ మూవీ ఖల్ నాయక్. మూడు దశాబ్దాల క్రితం ఒక ఊపు ఊపేసింది.
ఇక సంజయ్ దత్ సాజన్ అని ఒక సినిమా చేశారు. ఇది 1991లో రిలీజ్ అయింది. అప్పట్లో రఫ్ రోల్స్ వేసిన సంజయ్ ఒక్కసారిగా సాఫ్ట్ రోల్స్ వేయడం అంటే అది ఒక రికార్డే మరి. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఆయన అందుకున్నారు. ఇక సంజయ్ దత్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీస్ సూపర్ డూపర్ హిట్. ఇవే కాదు అనేక సినిమాలు సంజయ్ దత్ కెరీలో ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే జీవితంలో తన  తల్లి, అలనాటి సూపర్ స్టార్ నర్గీస్ దత్ ని 1981లో  సంజయ్ దత్ కోల్పోయాడు. హీరోగా తన మొదటి సినిమా రాఖీ మూడు రోజుల్లో విడుదల అవుతుందనగా  తల్లి కళ్ళుమూయడం సంజయ్ దత్ కి కోలుకోలేని షాక్. ఇక సంజయ్ దత్  మూడు వివాహాలు చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయింది. ఇలా ఆయన వైవాహిక జీవితంలో కూడా ఒడుదుడుకులు ఉన్నాయి.
మరో వైపు 1993 ముంబయ్ లో జరిగిన  వరస బాంబుల పేలుళ్ళ నేపధ్యంలో సంజయ్ దత్ అప్పటి నుంచి పలు మార్లు అరెస్ట్ అవుతూ వచ్చారు. దీని మీద ఎన్నో సార్లు కోర్టు కేసులు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు ఎరవాడ జైలులో  దుర్బర జీవితాన్ని గడిపాడు. సంజయ్ దత్ జీవితంలో జైలు అన్నది ఒక విషాద ఘటన అయితే ఇపుడు ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడం మరో విషాదం.
చిత్రమేంటంటే తల్లి నర్గీస్ దత్ కూడా క్యాన్సర్ తోనే 1981లో మరణించారు. ఇపుడు తల్లి వారసత్వం అన్నట్లుగా ఈ వ్యాధి సంజయ్ కి సోకింది. మొత్తానికి సంజయ్ దత్ జీవితం అంటే కష్టాల మయమే. ఆయన ఖల్ నాయక్ కా. లేక నాయక్ నా  అన్నది మొత్తం జీవితం చూసినా ఎవరికీ  అర్ధం కాదు, ఆయనలో ఎవరైనా కానీ విధి చేతిలో వింత పావులా జీవిత పర్యంతం చిక్కుకున్న ఓ దురద్రుష్టవంతుడని  చెప్పాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: