వెండితెరపై అందరిని కన్ఫ్యూజ్ చేసి.. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అయింది ఆ సినిమా..?

praveen

కొన్ని కొన్ని సార్లు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు దర్శక నిర్మాతల అంచనాలను తారుమారు చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఫ్లాప్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది అని అనుకున్న సినిమా హిట్ అవుతుంది. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విషయంలో ఇదే జరిగింది. ఆ  సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ  చివరికి అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి డిజాస్టర్ గా నిలిచిపోయింది ఆ సినిమా. ఆ సినిమా ఏదో కాదు వన్-నేనొక్కడినే. 

 


 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. కాలిక్యులేటెడ్  డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఎంతో కన్ఫ్యూస్  చేసింది అని చెప్పాలి. ఎందుకో ఈ సినిమా విషయంలో దర్శకుడి కాలిక్యులేషన్స్ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఎవరికీ అర్థం కాలేదు. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూస్  అయ్యారు అని చెప్పాలి. కొంతమందికి రెండు మూడు సార్లు చూస్తే కానీ ఈ సినిమా అర్థం కాలేదు. ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చివరకు డిజాస్టర్ గా నిలిచింది. 

 


 అయితే వెండితెరపై ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది  అనే చెప్పాలి. వెండి తెరపై చూసి కన్ఫ్యూజ్ అయిన ప్రేక్షకులందరూ బుల్లితెర పై చూసి  బాగా క్లారిటీ తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా ఎన్ని సార్లు వచ్చినా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు బుల్లితెరపై ఈ సినిమా చాలాసార్లు వచ్చింది. ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూడడానికి మాత్రం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు . ఇలా వెండి తెరపై కన్ఫ్యుస్  చేసినప్పటికీ బుల్లితెరపై మాత్రం అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: