ఆ సినిమా ఎన్ని సార్లు బుల్లితెరపై క్రేజ్ మాత్రం తగ్గలేదు..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఇలా వచ్చిన సినిమాలు కొన్ని వెండితెరపై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి భారీ వసూళ్లు రాబడితే... కొన్ని సినిమాలు వెండితెరపై  అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికే బుల్లి తెరపై మాత్రం సంచలనం సృష్టిస్తాయి . బుల్లితెరపై కొన్ని సినిమాలు ఎన్ని సార్లు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడు బోర్ కొట్టదు.ఎన్ని సార్లు  చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఇలా బుల్లితెరపై ఎంతగానో క్రేజ్ సంపాదించిన సినిమాలలో ఒకటి ఖడ్గం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఖడ్గం సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 ఖడ్గం సినిమా కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ సంపాదించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో.. రవితేజ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ హీరోలుగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఖడ్గం. ఈ సినిమా ప్రతి సంవత్సరం జనవరి 26... ఆగస్టు 15 వ తేదీలలో తప్పక వస్తుంది. ఈ సినిమా ఒక వేళ బుల్లితెరపై రాలేదు అంటే అటు ప్రేక్షకులే  ఆశ్చర్యపోతారు. అంతలా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఖడ్గం సినిమా. ఈ సినిమాలో  ప్రతి పాత్ర ఎంతో కీలకంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి సన్నివేశం అందరిలో దేశభక్తి నింపుతూ ఉంటుంది. 

 


 అందుకే ఈ సినిమా బుల్లితెరపై ఎన్నిసార్లు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం అస్సలు బోర్ కొట్టదు. అందుకే ఎన్నిసార్లు  వచ్చినా అదే క్రేజ్ ఉంటుంది ఖడ్గం సినిమా కి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి వెన్నుముక్కల  నిలిచింది అని చెప్పాలి.. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ తెలుగు ప్రజలను ఎంతగానో అలరిస్తూనే ఉన్నాయి. ఇలా ఈ సినిమా అటు వెండి తెర పైన సత్తా చాటడమే కాదు ఇటు బుల్లితెరపై కూడా సత్తా చాటింది అని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్నో సార్లు బుల్లితెరపై వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఈ సినిమా వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: