ఆ టైంలో శ్యాంప్ర‌సాద్‌రెడ్డి ద‌మ్ముధైర్యం అనుష్కానే?

Arshu
ప్రొడ్యూస‌ర్ శ్యాంప్ర‌సాద్‌రెడ్డి ఎన్నో చిత్రాలు తీశారు. అయితే ఏ చిత్రానికి ఆశించినంత ఫ‌లితం రాలేదు. ఇక ఆఖ‌రికి సినిమాలు చెయ్య‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్న స‌మ‌యానికి ఆయ‌న అనుష్క‌తో `అరుంధ‌తి` చిత్రం తీసి సూప‌ర్‌డూప‌ర్ హిట్ కొట్టారు. ఆ క‌థ విన్నాక ఆయ‌న అనుష్క పైన ఎంతైనా ఖ‌ర్చుపెట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. అదే స‌మ‌యంలో చాలా మంది ఇప్ప‌టివ‌ర‌కు అనుష్క న‌టించిన చిత్రాల‌న్నీ కూడా దాదాపు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే ఈ టైప్ లేడీ ఓరియంటెడ్ చిత్రం అనేది మొద‌టిసారి దాని కోసం అంత ఖ‌ర్చు చెయ్య‌డం స‌రికాద‌ని ఆయ‌న‌కు అంద‌రూ చెప్పారంట‌. ఇంకా మ‌రికొంద‌ర‌యితే నీకేమ‌యినా పిచ్చా చిరంజీవిగారితో అంజి చిత్రం తీసిన‌ప్పుడే పెద్దగా హిట్ కాలేదు ఇక అనుష్క ఎంత ఆమె కెరియ‌ర్ ఎంత మా మాట విను అని కూడా హిత బోధ చేశార‌ట. అయినా కూడా ఆయ‌న ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌కుండా ఆ చిత్రాన్ని నిర్మించారు సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టారు.

అంటే ఆ స‌మ‌యంలో ఆయ‌న అప్ప‌టికే చాలా చిత్రాలు నిర్మించి చేతుల కాల్చుకున్న సంద‌ర్భంగా ఇక ఆయ‌న‌కు ఉన్న ఒకే ఒక్క హోప్ ద‌మ్ము ధైర్యం ఒక్క అనుష్క మాత్ర‌మే. ఆ క‌థ విన‌గానే ఆయ‌న ఎంత అయినా ఖ‌ర్చు పెట్ట‌వ‌చ్చు అని డిసైడ్ అయి ఖర్చు చేశారు. సినిమా కూడా అలానే హిట్ అయింది. చాలా మంది సినిమా మ‌ధ్య‌లో డ్రాప్ అయిపోమ‌ని కూడా అన్నార‌ట‌. అయితే కోడిరామ‌కృష్ణ క‌థ‌ని క‌న్వే చేసిన ప‌ద్ధ‌తి ఆయ‌న‌కి బాగా న‌చ్చింద‌ట‌.  అరుంధ‌తి లేక‌పోతే శ్యాంప్ర‌సాద్ రెడ్డి లేడు అన్న స్థాయిలో ఆ సినిమా హిట్ అయింద‌ని చెప్పాలి. ఆ చిత్రంతోనే ఆయ‌న మ‌ళ్ళీ పిక‌ప్ అయ్యాడు. 

ఇటీవ‌లె ఆమె సినీ కెరియ‌ర్ ప‌దిహేనుళ్ళు దాటిన సంద‌ర్భంగా చేసిన ఈవెంట్‌లో ఆయ‌న ఈ విధంగా స్పందించారు. "అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా 'అరుంధ‌తి' అని అంద‌రూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన న‌టి తాను అని నేనంటాను. ఆ మాట‌కు నేను క‌ట్టుబ‌డి ఉంటాను. త‌న స్నేహితుల‌కు ఆమె ఆనందాన్ని క‌లిగిస్తుంది. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ‌ల్లా ఆమె స్నేహితుల ద‌గ్గ‌ర ఉంటుంది. వాళ్ల బాధ‌లు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజ‌యాల్నీ సెల‌బ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడ‌మ చేతికి కూడా తెలీదు. ఆమె త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా. 'నిశ్శ‌బ్దం' టీమ్‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా" అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: